TTD CHAIRMAN PAVES VISIT TO SRI ANJANEYA SWAMY AT KULLUR _ కుల్లూరు అభయారణ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న టిటిడి ఛైర్మన్

Tirupati, 22 May 2025: The TTD Chairman Sri BR Naidu visited Anjaneya Swamy at Arama Maruthi Nilaya Sanctuary in Kullur, Kaluvai Mandal, Nellore District on Thursday. 

Earlier, upon his arrival to the temple, the temple priests gave him a traditional Poornakumbha welcome. 

On the occasion of Hanuman Jayanti, TTD Chairman Sri BR Naidu visited Anjaneya Swamy on the invitation of local former MLC Madasu Gangadhar. 

On this auspicious occasion, the TTD Chairman, who reached the temple, was welcomed by District Collector Sri Anand, District SP Sri Krishna Kant and several other local leaders

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

కుల్లూరు అభయారణ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న టిటిడి ఛైర్మన్

తిరుమల, 2025, మే 22: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులోని ఆరామ మారుతి నిలయ అభయారణ్య ఆంజనేయ స్వామి వారిని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గురువారం దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు టిటిడి ఛైర్మన్ చేరుకోగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్ ఆహ్వానం మేరకు టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అభయారణ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న టిటిడి ఛైర్మన్ కు జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్, జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్, పలువురు స్థానిక నేతలు స్వాగతం పలికారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది