TTD CHAIRMAN PRESENTS SILKS TO KOLHAPUR DEITY _ కొల్హాపూర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్
Tirumala, 29 September 2025: On the occasion of Navaratri festival, TTD Chairman Sri B.R. Naidu presented silk vastrams to Kolhapur Sri Mahalakshmi Devi on behalf of TTD on Monday.
The Chairman and his spouse were welcomed by the temple priests and officials upon reaching the temple.
Later, the Chairman took the Pattu Vastrams in a procession and offered them to the deity and had darshan. The priests blessed them and offered Theertha Prasadams.
TTD Board Members Sri Sourabh Bora, Smt. Prashanthi, Sri Shantha Ram, Sri G. Bhanuprakash Reddy, TTD Ex-Officio Member Sri Diwakar Reddy and several officials participated in the program.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
కొల్హాపూర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్
తిరుమల, 2025 సెప్టెంబర్ 29: నవరాత్రి ఉత్సవాల సందర్బంగా కొల్హాపూర్ శ్రీ మహాలక్షి అమ్మవారికి సోమవారం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు దంపతులు టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.
ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ దంపతులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతి, శ్రీ శాంతా రామ్, శ్రీ జీ.భానుప్రకాష్ రెడ్డి, శ్రీ సౌరబ్ హెచ్ బొర, టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.








