TTD CHAIRMAN SRI B.R.NAIDU VISITED SRI PALLIKONDESWARA SWAMY TEMPLE IN SURUTUPALLI _ సురుటుపల్లిశ్రీపల్లికొండేశ్వరస్వామివారినిదర్శించుకున్నటీటీడీచైర్మన్బి.ఆర్. నాయుడుదంపతులు

Tirupati, August 03, 2026: TTD Chairman Sri B.R. Naidu visited the renowned Sri Pallikondeswara Swamy Temple at Surutupalli in Tirupati district on Monday and offered prayers to the deity.

The couple was accorded a traditional welcome with Purna Kumbham and Mangala Vadyam by Temple Chairman Sri Padmanabha Raju and Executive Officer Smt. Latha.

They participated in special prayers to Sri Pallikondeswara Swamy with Sri Sarvamangala Devi, praying for the welfare of the people and the protection of Sanatana Dharma.

Earlier, the Chairman offered prayers at the shrines of Sri Vighneswara Swamy, Sri Valmikeswara Swamy and Sri Maragathambika Ammavaru. Later, Vedic scholars blessed the couple with Veda Ashirvachanam at the Sri Pradosha Nandi Mandapam as per temple tradition.

TTD Board Members Sri Naresh, Sri Shantaram, and temple officials also participated in the programme.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరస్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు

తిరుపతి, 2026 ఆగస్టు 03: తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరస్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి లత ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో చైర్మన్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం చైర్మన్ దంపతులు శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రార్థనలు చేశారు.

అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వాల్మీకేశ్వరస్వామి, శ్రీ మరగతాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తదనంతరం శ్రీ ప్రదోష నంది మండపం వద్ద ఆలయ సంప్రదాయాల ప్రకారం వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య చైర్మన్ దంపతులకు ఆశీర్వచనం అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్, శ్రీ శాంతారాం, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది