TTD CHAIRMAN VISITS LOCATIONS FOR ALIPIRI REST HOUSE _ అలిపిరిలో వ‌స‌తి సౌక‌ర్యాల ఏర్పాటుకు స్థ‌లం ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirupati, 27 Dec. 19:TTD Chairman Sri YV Subba Reddy on Friday evening visited the location near Alipiri for building a new rest house for devotees. 
    
Speaking to media persons later the TTD Chairman said the objective was to locate the devotees at Alipiri Rest House with time slot darshan arrangements whenever there were huge crowds at Tirumala rest houses.
 
The new rest houses at Alipiri would have all facilities and amenities like Anna Prasadam, Dharmic programs etc.  
 
TTD will discuss and take a suitable decision for quicker action on all these aspects, the Chairman added. 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  
అలిపిరిలో వ‌స‌తి సౌక‌ర్యాల ఏర్పాటుకు స్థ‌లం ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి
 
డిసెంబరు 2019, తిరుప‌తి 27: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు తిరుప‌తిలో వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో భాగంగా అలిపిరి వ‌ద్ద  టిటిడి ఛైర్మ‌న్ ఇంజినీరింగ్ అధికారుల‌తో క‌లిసి స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ అలిపిరిలో భ‌క్తుల‌కు వ‌స‌తి ఏర్పాటు చేస్తే తిరుమ‌ల‌లో ర‌ద్ధీ అధికంగా ఉన్న స‌మ‌యంలో టైం స్లాట్ కేటాయించి తిరుప‌తిలోనే వ‌స‌తి క‌ల్పించ‌డానికి అవ‌కాశం ఉంద‌న్నారు. ఇందులో భాగంగా అలిపిరిలో నిర్మించ త‌ల‌పెట్ట‌నున్న వ‌స‌తి స‌ముదాయాల‌లో అన్న‌ప్ర‌సాదాలు, ధార్మిక కార్య‌క్ర‌మాలు, భ‌జ‌న‌లు, ధ్యానం, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.  ఈ విష‌య‌మై టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో చ‌ర్చించి త‌గు నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలిపారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.