TTD COPS AND POLICE RAIDS _ తిరుమల బాలాజీ నగర్ లో అనధికారికంగా ఉన్న వ్యక్తులపై టీటీడీ విజిలెన్స్, పోలీస్ తనిఖీలు
TIRUMALA, 18 AUGUST 2024: Under the instructions of TTD CVSO Sri Sreedhar, TTD Vigilance and Security sleuths with the help of local police in a joint operation, raided the dwellings of workers on the back side of Balaji Nagar in Tirumala on Sunday.
The cops found that these are the temporary sheds laid for the workers who worked as wage labourers in various construction activities of Tirumala earlier.
However, inspite of the completion of the works, though the contactor left Tirumala, many of the are still staying at Tirumala in more than 70 sheds that which includes some unauthorised persons also.
Keeping in view the safety of Tirumala, the vigilance sleuths have enlisted the workers in a joint operation organised on Sunday between 10am and 12 noon and forwarded the same to the Engineering department for verification.
Similar raids will be henceforth conducted at regular intervals to put a check to unauthorized entrants.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల బాలాజీ నగర్ లో అనధికారికంగా ఉన్న వ్యక్తులపై టీటీడీ విజిలెన్స్, పోలీస్ తనిఖీలు
తిరుమల, 2024 ఆగస్టు 18: టీటీడీ సివిఎస్‌వో శ్రీ శ్రీధర్ ఆదేశాల మేరకు టీటీడీ విజిలెన్స్, భద్రతా సిబ్బంది స్థానిక పోలీసుల సహకారంతో ఆదివారం తిరుమలలోని బాలాజీ నగర్ వెనుక భాగంలో ఉన్న కార్మికుల నివాసాలపై దాడులు నిర్వహించారు.
గతంలో తిరుమలలో వివిధ నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేసిన కార్మికుల కోసం తాత్కాలిక షెడ్లను వారి నివాసం కోసం ఏర్పాటు చేశారు.
అయితే, తిరుమలలో పనులు పూర్తయినప్పటికీ, కాంటాక్టర్ వెళ్లిపోయినప్పటికీ, చాలా మంది ఇప్పటికీ 70కి పైగా షెడ్లలో తిరుమలలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో కొంతమంది అనధికార వ్యక్తులు కూడా ఉన్నారు.
తిరుమల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్ అధికారులు ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో కార్మికుల జాబితాను ధృవీకరణ కోసం ఇంజినీరింగ్ విభాగానికి పంపించారు.
అనధికారికంగా ప్రవేశించే వారిని నిలువరించేందుకు ఇకపై ఇలాంటి దాడులు నిరంతరాయంగా నిర్వహింపబడతాయని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
కావున తిరుమలలో అనధికారికంగా నివసిస్తున్న వ్యక్తులు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలియజేస్తోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.