TTD COPS WINS NATIONAL MEDALS _ జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటిన టీటీడీ నిఘా మరియు భద్రతా అధికారులు
జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటిన టీటీడీ నిఘా మరియు భద్రతా అధికారులు
తిరుమల, 2024 డిసెంబరు 03: ఇటీవల కర్ణాటకలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ లో టీటీడీ నిఘా మరియు భద్రతా అధికారులు సత్తా చాటారు.
ఈ సందర్భంగా టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్ టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావును టీటీడీ పరిపాలన భవనంలోని ఆయన ఛాంబర్ లో మంగళవారంనాడు కలిసి టీటీడీ వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్రలు పథకాలు సాధించినట్లు వివరించడంతో ఈవో అభినందనలు తెలియజేశారు.
నవంబర్ 26 నుండి 30వ తేదీ వరకు బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లోని KSLTS (కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ స్టేడియం)లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 25వ ఆల్ ఇండియా పోలీస్ లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్-2024 ను నిర్వహించింది.
ఈ పోటీల్లో సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్జీ సహా మొత్తం 20 రాష్ట్ర పోలీసు బృందాలు, పారామిలటరీ బలగాలు పాల్గొన్నాయి.
ఈ పోటీల్లో వింగ్ వీజీవో శ్రీ రామ్‌కుమార్ వెటరన్ డబుల్స్‌లో రజత పతకాన్ని పొందగా, వీజీవో శ్రీ ఎ.సురేంద్ర ఓపెన్ టెన్నిస్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రెండు రజత పతకాలు పొందారు.
కాగా పతకాలు సాధించిన టీటీడీ వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్రలు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి పతకాలు సాధించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వీజీవోలను అడిషనల్ ఈవో అభినందించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.