TTD CRUSADE TO POPULARISE SCULPTURE ART _ శిల్ప‌క‌ళ‌ను విశ్వ‌వ్యాప్తం చేయ‌డానికి టిటిడి కృషి

శిల్ప‌క‌ళ‌ను విశ్వ‌వ్యాప్తం చేయ‌డానికి టిటిడి కృషి

– మూడు రోజుల వ‌ర్క్‌షాప్‌ను ప్రారంభించిన జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుప‌తి, 2022 సెప్టెంబరు 21: భార‌త‌దేశ సంస్కృతి, సంప్ర‌దాయాల్లో భాగ‌మైన శిల్ప‌క‌ళ‌ను విశ్వ‌వ్యాప్తం చేయ‌డానికి టిటిడి కృషి చేస్తుంద‌ని జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి చెప్పారు. ఈ ప్ర‌య‌త్నంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర సంప్ర‌దాయ ఆల‌య శిల్ప శిక్ష‌ణ సంస్థలో సంప్ర‌దాయ శిల్ప‌క‌ళ – అనుబంధ అంశాల‌పై మూడు రోజుల పాటు జ‌రిగే వ‌ర్క్‌షాప్‌ను బుధ‌వారం జెఈవో ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో జెఈవో మాట్లాడుతూ ప్రాచీన సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు. టిటిడి ప్రారంభించిన వ‌ర్క్‌షాప్ ఇందుకు నాంది మాత్ర‌మేన‌ని, భ‌విష్య‌త్తులో ఇలాంటి కార్య‌క్ర‌మాలు పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. గుడి ఔన్న‌త్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించే గొప్పక‌ళ శిల్ప‌క‌ళ అన్నారు. టిటిడి శిల్ప‌క‌ళాశాల ఎందరో ప్ర‌ముఖ స్థ‌ప‌తుల‌ను త‌యారు చేసింద‌న్నారు. ఈ క‌ళాశాల‌లో చ‌దివిన‌వారెంద‌రో ఉన్న‌త స్థానాల్లో ఉన్నార‌ని, నైపుణ్యం పెంపొందించుకుని గొప్ప‌స్థ‌ప‌తులుగా త‌యారుకావాల‌ని ఆమె విద్యార్థుల‌కు పిలుపునిచ్చారు.

క‌ళాశాల‌లో చేరే స‌మ‌యంలో ప్ర‌తి విద్యార్థి పేరు మీద ల‌క్ష రూపాయలు డిపాజిట్ చేసి కోర్సు పూర్త‌య్యాక వారికి వ‌డ్డీతోపాటు అంద‌జేస్తున్న ఏకైక సంస్థ టిటిడి మాత్ర‌మే అన్నారు. తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌తోపాటు మ‌న రాష్ట్రంలోని శిల్ప క‌ళాశాల‌ల నుంచి ప్ర‌ముఖ స్థ‌ప‌తులను పిలిపించి విజ్ఞానం పెంపొందించుకోవ‌డం కోస‌మే టిటిడి చ‌రిత్ర‌లో తొలిసారి వ‌ర్క్‌షాప్ ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 26 నుండి మార్చి 3వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన శిల్ప‌క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింద‌న్నారు. శిల్ప‌క‌ళ అభ్య‌సించే విద్యార్థుల‌కు ఇంగ్లీషు, కంప్యూట‌ర్ విద్య కూడా నేర్పిస్తామ‌ని, దీనివ‌ల్ల వారికి ఎంతో ఉప‌యోగం ఉంటుంద‌ని తెలిపారు. క‌ళంకారి, వ‌ర్లి ఆర్ట్‌, సౌరాష్ట్ర పెయింటింగ్ ఆర్ట్ కోర్సుల‌ను సాయంత్రం కోర్సులుగా ప్ర‌వేశ‌పెడ‌తామ‌న్నారు. శిల్ప‌క‌ళాశాల‌ను యూనివ‌ర్సిటీ స్థాయికి తీసుకొచ్చేందుకు యాజ‌మాన్యం ఆలోచిస్తోంద‌ని చెప్పారు.

ప్ర‌ముఖ స్థ‌ప‌తులు శ్రీ‌ రాధాకృష్ణ‌, డా. ద‌క్షిణామూర్తి, హైద‌రాబాద్ ప్లీచ్ ఇండియా ఫౌండేష‌న్ సిఈవో డా. శివ‌నాగిరెడ్డి ప్ర‌సంగించారు. డిఇవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ప్రిన్సిపాల్ శ్రీ వెంక‌ట‌రెడ్డి పాల్గొన్నారు.

ఆక‌ట్టుకున్న ఎగ్జిబిష‌న్‌

క‌ళాశాల‌లో వ‌ర్క్‌షాప్ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిష‌న్ క‌మ్ సేల్స్ కౌంట‌ర్లు సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి క‌ళాకృతుల ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభించారు. కుమారి పి.సాయిదేవిక నిరుప‌యోగమైన వ‌స్తువుల‌తో త‌యారుచేసిన వివిధ క‌ళాకృతుల స్టాల్‌ను సంద‌ర్శ‌కులు ఎంతో ఆస‌క్తిగా తిల‌కించారు. గృహాలంక‌ర‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే అనేక క‌ళాకృతులు ఈ స్టాల్‌లో ఉన్నాయి. అలాగే, శిల్పాలు, క‌ళంకారీ పెయింటింగ్స్‌, చేనేత చీర‌లు, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

(H & E) INAUGURATES THE THREE DAY WORKSHOP

 

Tirupati, 21 September 2022: With an aim to popularise Indian culture and traditions TTD commenced the Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture(SVITSA) which has completed sixty successful years and marching ahead to spread sculpture arts across the world said TTD JEO for Health and Education, Smt Sada Bhargavi.

 

Inaugurating a three-day workshop on Conventional Sculpture-allied issues at the sculpture institute in Tirupati on Wednesday the TTD JEO in her inaugural address said it is the responsibility of every Indian to protect Indian traditional art and architecture which depicts our ancient glory and culture. TTD would promote more programs like workshops, exhibitions etc. in a big way to nurture its students in the traditional temple sculpting art formats to make them best Sthapathis for future.

 

She said the TTD sculpture school in its six glorious decades of the journey had produced several talented Sthapathis who are now occupying higher positions across the world and called upon the students to learns the skills from the masters and become like them.

 

The JEO also said TTD is the only institution which deposits ₹1 lakh in name students to provide them financial stability and present it to the students with interest after completing their course.

 

She said TTD has invited prominent sthapathis from AP, Telangana, Tamilnadu and Karnataka for the workshop for the exchange of knowledge and skills. The sculpture exhibition held earlier this year between February 26-March 3 had earned a popular response from public.

 

TTD JEO said the sculpture students are also being taught English and computer education to help them in getting jobs. Similarly Kalamkari,Varli arts and Saurashtra painting are also taught as evening courses. The TTD board was also contemplating to elevate the sculpture school into a university, she maintained.

 

Among others, Eminent sthapathis Sri Radhakrishna, Dr Dakshinamurthy, Pleach India foundation CEO Dr Shivanagi Reddy delivered lectures to the students useful for their career.

 

TTD DEO Sri Govindarajan, Principal Sri Venkat Reddy also were present.

 

ATTRACTIVE EXHIBITION

 

An exhibition cum sales counters has been organised as part of the ongoing sculpture workshop which was also inaugurated by TTD JEO Smt Sada Bhargavi. Visitors viewed the special stall of Kumari P Sai Devika where different house hold decorative  artefacts made from waste materials were displayed. The exhibition also comprised stalls of statues, kalamkari paintings, handloom sarees, Panchagavya products etc.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI