TTD CVSO AND DISTRICT URBAN SP REVIEW SECURITY ARRANGMENTS FOR SRIVARI ANNUAL BRAHMOTSAVAM _ శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై టిటిడి సివిఎస్వో, అర్బన్ ఎస్పీ సమీక్ష
Tirumala, 10 September 2020: In view of ensuing Srivari annual Brahmotsavams from September 19-27, TTD CVSO Sri Gopinath Jatti and Tirupati Urban SP Sri Ramesh Reddy reviewed the security arrangements to be meed in co-ordination with TTD Vigilance and Police at a meeting held in Annamaiah Bhavan on Thursday evening at Tirumala.
Speaking to reporters later, TTD CVSO Sri Gopinath Jatti said that as the annual Brahmotsavams are set to be held in Ekantham in view of prevailing Covid-19 restrictions, only devotees with on-line Srivari Darshan tickets alone will be allowed to visit Tirumala.
Since the offline issue of SSD tickets has been suspended, TTD has made extensive publicity for devotees especially coming from Tamilnadu as part of the Peritasi holy month and other neighbouring states, that they should all possess online Srivari darshan tickets, which is mandatory to get entry into Tirumala. He appealed to devotees from all regions to co-operate with the TTD in making the Brahmotsavam festival a success by following the COVID guidelines.
The Chief Vigilance and Security Officer of TTD said special vigilance steps have been made for the protection of golden Rathams and wooden chariots present in the 49 TTD temples across the country and CC Camera Surveillance has also been enhanced on 24×7 basis.
Speaking later the district Urban Superintendent of police Sri Ramesh Reddy said CC cameras have been installed at all TTD temples, mutts etc.to ensure protection to the holy places. He also said Security has been enhanced at all the 676 temples in the Chittoor district. Any activity by individuals or social media aimed at disturbing communal harmony and peace will be strictly dealt with.
The SP said as Srivari annual Brahmotsavam was held in ekantham in view of the COVID-19 restrictions, there was no need for special security arrangements by the district police except some police force to cover VIP visits if any. He appealed to the public to call upon WhatsApp no 80999 99977 if they come across any suspicious movements if any.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై టిటిడి సివిఎస్వో, అర్బన్ ఎస్పీ సమీక్ష
తిరుమల, 2020 సెప్టెంబరు 10: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో భక్తుల భద్రత, ప్రముఖుల పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ గోపినాథ్‌జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ రమేష్‌రెడ్డి కలిసి గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ సమావేశం జరిగింది.
సమావేశం అనంతరం సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి మీడియాతో మాట్లాడుతూ ఈ సారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయని, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు మాత్రమే దర్శనానికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రముఖులు పర్యటించినపుడు తిరుపతి అర్బన్ పోలీసు యంత్రాంగంతో కలిసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు. ఈ నెలలో పెరటాసి మాసం రానుండడంతో తమిళనాడు నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందన్నారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు తాత్కాలికంగా రద్దయ్యాయని, ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు బుక్ చేసుకుని మాత్రమే తిరుమలకు రావాలని తమిళనాడులోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. అన్ని ప్రాంతాల భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని టిటిడికి, స్థానిక పోలీసులకు సహకరించాలని కోరారు. టిటిడికి దేశవ్యాప్తంగా 49 ఆలయాలున్నాయని, అదేవిధంగా, విద్యాసంస్థలు, హాస్టళ్లు, కల్యాణమండపాలున్నాయని, వీటి వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించామన్నారు. మొత్తం 49 ఆలయాల్లో 20 ఆలయాల్లో రథాలున్నాయని, వీటి వద్ద భద్రతా సిబ్బందికి విధులు కేటాయించడంతోపాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని ఆలయాల్లో సిసి కెమెరాలు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు.
తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన నేపథ్యంలో టిటిడి పరిధిలోని ఆలయాలు, మఠాల వద్ద భద్రతా ఏర్పాట్లపై చర్చించామన్నారు. అన్ని ఆలయాల్లో సిసి కెమెరాలను పరిశీలించి భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. తిరుపతి అర్బన్ పోలీసు పరిధిలోని ఆలయాలను గుర్తించి వాటి భద్రత కోసం తగిన చర్యలు చేపట్టినట్టు చెప్పారు. మతసామరస్యానికి, ప్రశాంతతకు భంగం కలిగేలా సామాజిక మాధ్యమాలు గానీ, వ్యక్తులు గానీ వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయాల వద్ద ఎలాంటి సమస్యను గుర్తించినా, ఆకతాయిల సమాచారం ఉన్నా 8099999977 వాట్సాప్ నంబరుకు సమాచారం పంపాల్సిందిగా కోరారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.