TTD DIARIES AND CALENDARS AVAILABLE ONLINE _ ఆన్ లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో టిటిడి డైరీలు, క్యాలెండర్లు
Tirupati, 19 December 2024: For the convenience of the devotees, TTD is selling 2025 year calendars and diaries to the devotees online in select areas through TTD website.
For the year 2025, TTD has made available 12-page, 6-page, table-top-calendars, deluxe diaries, small diaries, Sri Venkateswara Swamy, Sri Padmavati Ammavari large size, Srivari and Sri Ammavari joint calendars.
2025 calendars and diaries have been made available to devotees in selected areas of TTD namely Tirumala, Tirupati, Tiruchanoor along with TTD publication stalls in Hyderabad, Chennai, Bangalore, Vijayawada, Visakhapatnam, New Delhi, Mumbai, Vellore and other major Kalyanamandapams.
The convenience of getting TTD diaries and calendars at their doorstep through the postal department remains the same as before for those who have booked online through the TTD website.
Devotees are requested to avail the facility of purchasing TTD calendars and diaries online through TTD website (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) only at fixed prices.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆన్ లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో టిటిడి డైరీలు, క్యాలెండర్లు
తిరుపతి, 2024 డిసెంబర్ 19: భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆప్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది.
2025 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టిటిడి అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా టిటిడి ఎంపిక చేసిన ప్రాంతాలైన తిరుమల, తిరుపతి, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు, ఇతర ప్రధాన కళ్యాణమండపాల్లో 2025 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది.
టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది.
టిటిడి క్యాలెండర్ లు, డైరీలను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేసేందుకు కల్పించిన సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.