TTD EDUCATIONAL INSTITUTIONS TO OPEN FROM NOVEMBER 2 SAYS- TTD JEO (HEALTH & EDUCATION) _ నవంబరు 2న టిటిడి విద్యా సంస్థలు ప్రారంభం – జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
Tirupati, 31 October 2020: TTD JEO (Health & Education) Smt Sada Bhargavi said on Saturday that all the schools and colleges managed by the TTD commence from November 2.
She made the announcement while speaking at a review meeting of college Principals and School Head masters on Saturday evening in the TTD administrative building.
The TTD JEO instructed the officials to organise complete sanitation at all colleges and schools as per state and central Covid-19 guidelines.
She said during 2020-21 academic year admissions be given as per guidelines of 16-30 students per class, regular sanitation, masks and social distancing et all places.
She directed the health department officials to ensure regular sanitation and availability of soap etc. in all school and college corridors. Covid-19 awareness programs for students, their parents are conducted at regular intervals.
The TTD JEO also issued special directions of guidelines and precautions to be organised by the officials at all TTD institutions.
DEO Sri Ramana Prasad, Additional Health officer, Dr Sunil Kumar, Principals of all colleges and head masters of all schools were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడి విద్యా సంస్థలలో మెరుగైన శానిటైజెషన్ (పారిశుద్ధ్య) ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టిటిడి కళాశాలలో 2020 – 21 విద్యా సంవత్సరంలో నిర్ధేశించిన సీట్లలలో మాత్రమే విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. తరగతి గదులలో 16 నుండి 30 మంది విద్యార్థులు ఉండేలా చూడాలని, విద్యార్ధుల మధ్య భౌతిక దూరం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, క్లాస్ రూమ్‌లను ఎప్పటి కప్పుడు శానిటైజ్ చేయాలన్నారు.
విద్యాసంస్థల ప్రాంగణంలో శానిటైజర్లు, సోపులు ఉంచాలని, అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రతి కళాశాలకు రెండు కోవిడ్ ప్రథమ చికిత్స కిట్లు అందించాలని వైద్య ఆధికారులను ఆదేశించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కోవిడ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం కళాశాలల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో డిఇవో శ్రీ రమణ ప్రసాద్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్‌కుమార్, టిటిడి కళాశాలల ప్రిన్సిపాల్స్ , పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గోన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.