TTD EMPLOYEES SPORTS MEET _ కార్యాలయ పని వేళలకు ఇబ్బంది లేకుండా ఉద్యోగులకు క్రీడా పోటీలు

Tirupati, 16 Feb. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy has directed officials concerned to conduct annual employees sports meet without disturbing working hours.

Addressing a review meeting on the annual sports meet at the Sri Padmavati rest House on Tuesday, the TTD EO directed officials to prepare an action plan for the sports meet and that officials also should participate in the events held after office hours in the evenings. He advocated that in sports all are equal and advised no need to conduct separate sports for officials.

He said the sports events be completed by March 14 and prize distribution be held on the same day. For TTD women employees he wanted some games to be held before March 8 and prize presentations made on March 8, on International Women’s Day.

The participants for both individual and team events should register their names by 20th and the schedule of games should be announced ahead and last moment or spot registrations should not be entertained.

He also directed officials to prepare more grounds including the Parade grounds behind the TTD administrative buildings for sports events and to conduct more games during holidays.

The TTD EO said instead of cash prizes the winners should be given goods useful to them.

TTD welfare department DyEO Sri Ananda Raj, PT masters were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కార్యాలయ పని వేళలకు ఇబ్బంది లేకుండా ఉద్యోగులకు క్రీడా పోటీలు

– అధికారులు కూడా ఉద్యోగులతో కలిసే ఆడాలి

– అధికారులకు టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదేశం

తిరుపతి 16 ఫిబ్రవరి 2021: కార్యాలయ పని వేళలకు ఇబ్బంది కలగకుండా ఉద్యోగులకు స్పోర్ట్స్, గేమ్స్ నిర్వహించాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

టీటీడీ ఉద్యోగులకు ప్రతి ఏటా నిర్వహించే స్పోర్ట్స్, గేమ్స్ ఈ ఏడాది ఎలా నిర్వహించాలనే అంశంపై శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం ఈవో అధికారులతో సమీక్షించారు. ఉదయం కార్యాలయ పని వేళలకు ముందు, సాయంత్రం కార్యాలయ పని వేళలు ముగిశాక స్పోర్ట్స్, గేమ్స్ ఎలా నిర్వహిస్తారో ప్రణాళిక తయారు చేయాలని ఈవో సూచించారు. ఏటా ఎంత మంది ఉద్యోగులు వీటిలో పాల్గొంటున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రీడల్లో వ్యక్తిగత పోటీల్లో పాల్గొనేవారు, టీమ్ లుగా పాల్గొనే వారు ఈ నెల 20వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకునే ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. అప్పటి కప్పుడు పేర్లు నమోదు చేసుకునే విధానం వల్ల క్రమశిక్షణ ఉండదని ఈవో అభిప్రాయపడ్డారు. పేర్ల నమోదు అయ్యాక ఏ టీమ్ ఎప్పుడు ఆడాలో, ఏ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారో ముందే ప్రకటించాలని చెప్పారు. సెలవు రోజుల్లో గేమ్స్ నిర్వహించేలా ప్రణాళిక తయారు చేస్తే మంచిదని ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి సూచించారు. గేమ్స్ నిర్వహణ కోసం ఎక్కువ గ్రౌండ్లు అందుబాటులోకి తెచ్చుకోవాలని, పరిపాలన భవనం లోని గ్రౌండ్ ను కూడా బాగా ఉపయోగించుకోవాలన్నారు. క్రీడల్లో అందరూ సమానమేనని, అధికారులు కూడా ఉద్యోగులతో కలసి ఆడాలన్నారు. అధికారులకు ప్రత్యేకంగా టీమ్ లు అవసరం లేదని చెప్పారు. విజేతలకు నగదు బహుమతులు వద్దని, వారికి ఉపయోగపడే వస్తువులైనా సరే బహుమతిగా ఇవ్వాలన్నారు. మార్చి 14వ తేదీలోగా స్పోర్ట్స్, గేమ్స్ ముగించి 14వ తేదీ బహుమతుల ప్రదానం కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈవో చెప్పారు.

క్రికెట్ లాంటి గేమ్స్ లో అనుభవం, అవగాహన ఉన్న వారినే ఆడించాలని, లేక పోతే గాయాలయ్యే ప్రమాదం ఉంటుందని ఈవో చెప్పారు.

టీటీడీ సంక్షేమ శాఖ అధికారి శ్రీ ఆనంద రాజు తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.