TTD EO INSPECTS SP CHILDREN’S AND SV TATA CANCER HOSPITALS _ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలం, టాటా క్యాన్సర్ ఆసుపత్రిని పరిశీలించిన టిటిడి ఈఓ

Tirupati, 01 May 2022: TTD EO Dr KS Jawahar Reddy on Sunday inspected the locations of Sri Padmavati Super Specialty hospital and Sri Venkateswara Tata cancer hospital in Tirupati.

As the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy is scheduled to lay the foundation stone for the Children’s hospital and inaugurate the Tata cancer hospital on May 5, the inspected the ongoing arrangements for the same.

Speaking later at the BIRRD complex, the EO said the Children’s super Specialty Hospital to be built by TTD at a cost of ₹240 crore has seven departments.

He said the Tata cancer hospital is ready to provide quality cancer Medicare. TTD also has plans to upgrade the Cancer Care Centre at SVIMS to serve the people of Rayalaseema.

He said the CM will also inaugurate a Smile Train ward for Children with cleft palate and hearing impairment.

TTD EO said with all these medical institutions Tirupati is all set to become a Medical Hub in South India.

TTD Additional EO Sri AV Dharma Reddy, District Collector Sri Venkatramana Reddy, CMO OSD Dr Harikrishna, JEO Sri Veerabrahmam, District SP Sri Parameswar Reddy, Corporation Commissioner Kumari Anupama Anjali, TTD Chief Engineer Sri Nageswara Rao, Director of Sri Padmavati Hridayalaya Dr Srinath Reddy, BIRRD OSD Dr Reddappa Reddy, DSP Sri Murali Krishna, SVBC CEO Sri Suresh Kumar, RDO Sri Kanaka Narasa Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలం, టాటా క్యాన్సర్ ఆసుపత్రిని పరిశీలించిన టిటిడి ఈఓ

తిరుపతి, 2022 మే 01: తిరుపతి లో మే 5న గౌ. ముఖ్య‌మంత్రివ‌ర్యులచే శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థలాన్ని, టాటా క్యాన్సర్ ఆసుపత్రిని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఆదివారం ఉదయం జిల్లా యంత్రాంగంతో కలిసి పరిశీలించారు.

అనంతరం బర్డ్ ఆసుపత్రిలో ఈఓ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో చిన్న‌పిల్ల‌ల‌కు అధునాతన మెరుగైన వైద్యం అందించేందుకు టిటిడి ఆధ్వ‌ర్యంలో సుమారు రూ.240 కోట్ల వ్య‌యంతో 7 విభాగాలతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కానుందన్నారు. అదేవిధంగా టాటా క్యాన్స‌ర్ ఆసుప‌త్రి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, దీంతో పాటు స్విమ్స్ లోని క్యాన్సర్ కేర్ సెంటర్ ను బలోపేతం చేసి రాయలసీమ వాసులకు మెరుగైన క్యాన్సర్ వైద్యం అందిస్తామన్నారు. వీటితోపాటు బర్డ్ ప్రాంగణంలోని శ్రీ పద్మావతి హృదయాలయలో గ్రహణమొర్రి బాధిత పిల్లల కోసం స్మైల్ ట్రైన్ వార్డును, వినికిడి లోపం గల చిన్నారుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వీటన్నింటనీ గౌ.ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, తద్వారా దక్షిణాదిలో తిరుపతి మెడికల్ హబ్ గా మారనుందని తెలిపారు.

అనంతరం ఈఓ టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగంతో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రివర్యుల పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.

టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ డాక్టర్ హరికృష్ణ, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి,సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, కార్పొరేషన్ కమిషనర్ కుమారి అనుపమ అంజలి, టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, శ్రీ పద్మావతి హృదయాలయ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, కాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ రమణన్, డిఎస్పీ శ్రీ మురళీకృష్ణ, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్ కుమార్ ,
ఆర్డీఓ శ్రీ కనకనరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.