TTD EO INSPECTS SRINIVASA SETHU FLYOVER WORKS _ శ్రీ‌నివాస సేతు ఫ్లైవ‌ర్ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఈవో

Tirupati,22 September 2022: TTD EO Sri AV Dharma Reddy on Thursday inspected the ongoing Srinivasa Sethu flyover works connecting Kakakambadi road to Leela Mahal circle via  Vasavi Bhavan on Kapilathirtham road in Tirupati.

 

Accompanied by district collector Sri Venkataramana Reddy and SP Sri Parameswar Reddy he went round to inspect the ongoing constructions.

 

The Flyover is getting ready to be inaugurated by Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on September 27.

 

He directed the officials concerned that the works should be completed by September 26.

 

TTD JEO Sri Veerabrahmam, Joint collector Sri Balaji, Municipal commissioner Kumari Anupama Anjali, TTD CE Sri Nageswara Rao Municipal corporation SE Sri Mohan, and APCON manager Sri Rangaswami and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌నివాస సేతు ఫ్లైవ‌ర్ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఈవో

తిరుప‌తి, 2022 సెప్టెంబరు 22: క‌ర‌కంబాడి మార్గం నుండి లీలామ‌హ‌ల్ స‌ర్కిల్ మీదుగా క‌పిల‌తీర్థం రోడ్డులోని వాస‌వి భ‌వ‌న్ వ‌ర‌కు నిర్మిస్తున్న శ్రీ‌నివాస సేతు ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నుల‌ను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, ఎస్పీ శ్రీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డితో క‌లిసి గురువారం ప‌రిశీలించారు. సెప్టెంబ‌రు 27వ తేదీ ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభిస్తార‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన ప‌నులు 26వ తేదీ నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. మున్సిప‌ల్‌, టిటిడి ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ‌ప‌నులు చేస్తున్న ఆఫ్కాన్ సంస్థ ప్ర‌తినిధుల‌కు ఈవో ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, జాయింట్ క‌లెక్ట‌ర్ శ్రీ బాలాజి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కుమారి అనుప‌మ అంజ‌లి, టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎస్ఇ శ్రీ మోహ‌న్‌, ఆఫ్కాన్ సంస్థ మేనేజ‌ర్ శ్రీ రంగ‌స్వామి ప‌లువురు అద‌న‌పు ఎస్పీలు, డిఎస్పీలు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.