TTD EO INSPECTS TTD PRESS & SALES WING AND EDUCATION OFFICES _ టీటీడీ ప్రెస్, సేల్స్ వింగ్, విద్యా శాఖ కార్యాలయాలు పరిశీలించిన ఈవో
Tirupati, 2 Jan. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy on Saturday inspected the TTD Press (printing, binding, CTP, Composing) besides the Education Department and interacted with staff members.
At the sales wing, he enquired about stocks of published books, CDs and DVDs and also instructed the OSD Sri Ramaraju to increase the number of Printing staff and to set up multi-colour printing press machines.
Later on, he also visited the premises of the Education Department and enquired about schools, colleges etc. run by TTD.
DyEO of Education Department Sri Govindarajan, Sapthagiri Chief Editor Acharya Rajagopalan and SE 1 Sri Jagadishwar Reddy and VGO Sri Manohar were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ ప్రెస్, సేల్స్ వింగ్, విద్యా శాఖ కార్యాలయాలు పరిశీలించిన ఈవో
తిరుపతి, 02 జనవరి 2021: టీటీడీ ముద్రణాలయం ( ప్రెస్) సేల్స్ వింగ్(అమ్మకాల విభాగం) విద్యా శాఖ కార్యాలయాన్ని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు.
ప్రెస్ లోని ప్రింటింగ్,బైన్డింగ్, సిటిపి, కంపోజింగ్ విభాగాలను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యా శాఖ కార్యాలయాన్ని పరిశీలించి కళాశాలలు, పాఠశాలల వివరాలు తెలుసుకున్నారు.
సేల్స్ వింగ్ లోని పుస్తకాలు, సిడిలు, డివిడిల స్టాక్ గురించి తెలుసుకున్నారు. ప్రెస్ లో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్నందున సిబ్బంది సంఖ్య పెంచాలని, మల్టీకలర్ ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేయించాలని ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు ఈవోను కోరారు.
విద్యా శాఖ డిప్యూటి ఈవో శ్రీ గోవింద రాజన్, సప్తగిరి పత్రిక చీఫ్ ఎడిటర్ ఆచార్య రాజగోపాలన్, ఎస్ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, విజీవో శ్రీ మనోహర్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.