TTD EO REVIEWS GARUDA VARADHI WORKS _ గరుడవారధి పనుల ప్రగతిపై ఈఓ సమీక్ష
SANCTIONS 2ND INSTALMENT OF Rs. 25 CRORE
Tirupati, 29 July 2021: TTD executive officer Dr KS Jawahar Reddy has sanctioned the second instalment of Rs. 25 crore, totalling TTD contribution to the prestigious Garuda Varadhi project to ₹50 crore
During a review of the project at the TTD administrative building on Thursday the Tirupati Municipal Corporation commissioner informed the EO that flyover works shall be completed upto Nandi circle from Tirupati bus station by August this year.
Tirupati Municipal Corporation Commissioner Sri Girish, Smart city General Manager Sri Chandramouli, Superintending Engineer Sri Mohan, TTD FA&CAO Sri O Balaji, CE Sri Nageswara Rao were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
గరుడవారధి పనుల ప్రగతిపై ఈఓ సమీక్ష
రెండో విడతగా రూ.25 కోట్లు కేటాయింపు
తిరుమల, 2021 జులై 29: గరుడవారధి పనుల ప్రగతిపై టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి గురువారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టిటిడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పనుల కోసం రెండో విడతగా రూ.25 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటివరకు టిటిడి రూ.50 కోట్లు విడుదల చేసినట్టయింది.
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి నంది సర్కిల్ వరకు వారధి పనులు పూర్తి కావచ్చాయని, ఆగస్టు నెలాఖరుకు యాత్రికులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈఓకు వివరించారు.
ఈ సమీక్షలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శ్రీ గిరీష, స్మార్ట్ సిటి జనరల్ మేనేజర్ శ్రీ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ మోహన్, టిటిడి ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.