TTD EO REVIEWS ON SRIVANI TRUST _ శ్రీవాణి ట్రస్ట్ నిర్వహణపై అధికారులతో టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు సమీక్ష

Tirupati, 17 May 2025: TTD Executive Officer Sri J. Syamala Rao instructed the officials concerned to review the existing guidelines of the SRIVANI Trust and make them more efficient, user-friendly, and transparent. 

He held a review meeting with officials on Saturday at his chamber in the TTD Administrative Building.

On this occasion, the EO stated that the construction of temples plays a pivotal role in spreading Sanatana Dharma among the public. He emphasized that such temple projects foster divine contemplation, spirituality, and service-mindedness, which in turn strengthen human values and relationships.

He directed officials to prepare a detailed report on the current status of temple construction and renovation works being carried out with the support of Samarasata Seva Foundation and the Endowments Department. He also instructed that an action plan be drafted for providing Dhoopa, Deepa, Naivedyam and ongoing maintenance for the completed temples.

Furthermore, the EO suggested regular inspections by TTD during and after the completion of temple constructions. For neglected temples, he stressed the need for a clear plan to ensure proper rituals and services. 

The EO also recommended establishing a dedicated mechanism for managing temples built in under developed areas.

Additional EO Sri Ch. Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, Chief Engineer Sri Satyanarayana, and FACAO Sri Balaji were present in the meeting.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీవాణి ట్రస్ట్ నిర్వహణపై అధికారులతో టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు సమీక్ష

తిరుపతి, 2025, మే 17: శ్రీవాణి ట్రస్ట్ లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను పునః సమీక్షించుకుని మరింత మెరుగ్గా, సులభతరంగా, పారదర్శకంగా ఉండేలా తయారు చేయాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని మరింత విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ఆలయాల నిర్మాణాలు పునాదుల్లాంటివని ఆయన మాట్లాడారు. ఆలయాల నిర్మాణాలతో దైవచింతన, ఆధ్యాత్మికత, సేవా భావం సమభావంతో మానవ సంబంధాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే సమరసత సేవా పౌండేషన్, దేవాదాయ శాఖ సౌజన్యంతో నిర్మితమవుతున్న ఆలయాల ప్రస్తుత స్థితి, జీర్ణాద్ధరణ పనులు ఏ దశలో ఉన్నాయో నివేదిక తయారు చేయాలన్నారు. పూర్తి అయిన ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు, నిర్వహణ అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఆలయాల నిర్మాణం జరుగుతున్నపుడు, పూర్తయిన తరువాత ఆలయ నిర్వహణను టిటిడి తరచూ తనిఖీలు చేపట్టాలని సూచించారు. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల నిర్వహణకు పక్కాగా ప్రణాళికలు, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల నిర్వహణకోసం ప్రత్యేకంగా యంత్రాంగాన్ని రూపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.