TTD EO REVIEWS PR, RECEPTION AND IT _  రెవిన్యూ, వసతి మరియు ఐటి విభాగాలను సమీక్షించిన టీటీడీ ఈవో  

EXCLUSIVE AEO TO MONITOR OUTSIDE LINES DURING RUSH

TIRUMALA, 18 JUNE 2024: TTD EO Sri J Syamala Rao on Tuesday reviewed the Revenue-Panchayat Raj, Reception and IT wings of TTD.

In the review meeting held at the Gokulam Rest House in Tirumala, he made some important instructions to the respective departments.

The EO instructed the IT wing to resume scanning of Divyadarshan tokens at the 1200th Step along the Srivari Mettu footpath route. He also directed the Vigilance wing to ensure that there is no misuse in the APSRTC and Tourism quota of tickets. 

He asked the Reception wing officials to come out with a list of people who are taking the accommodation  in a frequent manner and said stern action will be taken against the Dalaris who are repeatedly taking the rooms, misusing the facilities. 

Later he instructed the concerned to place Electronic display board at Narayanagiri Sheds akin to Vaikuntham compartments to display relevant information about approximate Darshan hours for the information of the public.

He reviewed the Revenue-Panchayat Raj department and was briefed about the tenements, hawkers, shop keepers, hotels, commercial shops, land allotment and material permission to Donor Cottages by the concerned officials.

In a major decision to minimise the pilgrim woes during the rush period, the EO instructed to immediately deploy one exclusive Assistant Executive Officer (AEO) to monitor the line properly whenever the pilgrim rush is heavy and comes outside spreading over five kilometers. He said, a team comprising an official from Health, Annaprasadam, Srivari Seva will also be present to give the proper feedback so as to ensure hassle free movement as well as darshan to the tokenless pilgrims. 

INSPECTIONS

Later in the evening, the EO inspected Janata Canteens, Hotels and verified the cost of the item served to the pilgrim and the rates displayed on the boards outside the eateries. The EO made a quick visit to verify the outside lines which were at Shilatoranam point followed by the inspection at Narayanagiri Rest House No.3, Seshadri Nagar Cottages.

Along with the EO, JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, EEs Sri Srinivas, Sri Jaganmohan Reddy, Sri Srihari, DE Electrical Sri Ravishankar Reddy, CPRO Dr T Ravi and others were present in the inspection.

In the review meetings JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore the respective Heads of the departments were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రెవిన్యూ, వసతి మరియు ఐటి విభాగాలను సమీక్షించిన టీటీడీ ఈవో
– రద్దీ సమయంలో బయట క్యూ లైన్‌లను పర్యవేక్షించడానికి ప్రత్యేక ఏఈవో

తిరుపతి, 2023 జూన్ 18: టీటీడీ రెవెన్యూ-పంచాయతీ రాజ్, రిసెప్షన్ మరియు ఐటి విభాగాలపై టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు మంగళవారం సమీక్షించారు.

తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఆయన జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సి వి ఎస్ ఓ శ్రీ నరసింహ కిషోర్ లతో కూడి ఆయా శాఖల అధిపతులతో సమీక్షించారు. అనంతరం వారికి పలు కీలక సూచనలు చేశారు.

శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్‌ను పునఃప్రారంభించాలని ఐటీ విభాగానికి ఈవో సూచించారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ, టూరిజం కోటాలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా చూడాలని ఆయన విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు.

తరచూ వసతి గృహాలు తీసుకుంటున్న వారి జాబితాను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అదే విధంగా భక్తుల సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ పదేపదే గదులు తీసుకుంటున్న దళారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజిలెన్స్ అధికారులని ఆదేశించారు.

అనంతరం నారాయణగిరి షెడ్‌ల వద్ద వైకుంఠం కంపార్ట్‌మెంట్‌ల మాదిరిగానే ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డును భక్తుల సమాచారం కోసం ప్రదర్శించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రెవెన్యూ-పంచాయతీ రాజ్ శాఖపై సమీక్షించిన ఆయన, తిరుమల స్థానికులకు కేటాయించిన ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య దుకాణాలు, వాటి అద్దెలు, డోనర్ కాటేజీలకు సంబంధించి భూముల కేటాయింపు, ముడి సరుకుల అనుమతుల గురించి సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు.

యాత్రికుల రద్దీ అధికంగా ఉండి దాదాపు ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న క్యూ లైన్‌లను పర్యవేక్షించడానికి తక్షణమే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏఈఓ)ని ప్రత్యేకంగా నియమించాలని ఈఓ ఆదేశించారు.

ఆరోగ్యం, అన్నప్రసాదం, శ్రీవారి సేవకు చెందిన అధికారులతో కూడిన ఓ బృందం ఏ ఈ ఓ తో ఎప్పటి కప్పుడు సమన్వయించుకుంటూ ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన సమాచారంతో త్వరగా దర్శనం కల్పించడానికి కృషి చేయాలని
ఆయన చెప్పారు.

ఈవో తనిఖీలు :

అనంతరం ఈవో, అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం జనతా క్యాంటీన్లు, హోటళ్లను పరిశీలించి యాత్రికులకు వడ్డించే తినుబండారాల ఖరీదు, బయట బోర్డులపై ప్రదర్శించిన ధరలను పరిశీలించారు. శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్లు, నారాయణగిరి అతిధి భవనాలు నెం.3, శేషాద్రి నగర్ కాటేజీలను ఆయన పరిశీలించారు.

ఈవోతో పాటు జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీ నరసింహకిషోర్, సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఈఈలు శ్రీ శ్రీనివాస్, శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీ శ్రీహరి, డీఈ ఎలక్ట్రికల్ శ్రీ రవిశంకర్ రెడ్డి, సీపీఆర్వో డాక్టర్ టి రవి తదితరులున్నారు.

అంతకుముందు తనిఖీలు సమీక్షా సమావేశాల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.