TTD GOES ECO-FRIENDLY WAY _ తితిదే పరిపాలనా భవనంలో సౌర విద్యుత్ ప్లాంట్
TIRUPATI, JUNE 17: The world famous Hindu religious institution of Tirumala Tirupati Devasthanams(TTD) which has been administering the affairs of famous hill shrine of Lord Venkateswara has now donned “Eco-Friendly” avatar by installing of non-conventional solar energy plant in the administrative building in Tirupati.
The L&T ltd. along with Aeon Renewable Energy solutions(P)ltd. and Crux Industries India(P)ltd. from Chennai installed 100KWp solar photo-voltaic roof top power plant on TTD administrative building at a cost of Rs.1.25cr.
Usually the average monthly power consumption of the administrative building complex is 1.2lakh units where as the newly installed power plant will meet the partial needs of the office by generating approximately 1.5lakh units annually. This plant saves approximately 100tonnes of corbon emission every year and the life span of the plant is 25years.
—————————————————————————-
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తితిదే పరిపాలనా భవనంలో సౌర విద్యుత్ ప్లాంట్
తిరుపతి, జూన్ 17, 2013: తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో 100 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ ప్లాంటు పనులు పూర్తయ్యాయి. చెన్నైకి చెందిన ఎల్ అండ్ టి లిమిటెడ్, ఏయోన్ రెనెవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, క్రక్స్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలు విరాళంగా తితిదే పరిపాలనా భవనంపై సౌరవిద్యుత్ ప్లాంటును ఏర్పాటుచేశాయి.
తితిదే పరిపాలనా భవనానికి సుమారు 600 కిలో వోల్టుల విద్యుత్ అవసరమవుతోంది. ఇందులో 200 కిలోవోల్టులు వెలుతురు కోసం కాగా మిగతా విద్యుత్తు కార్యాలయ పనులకు వినియోగిస్తున్నారు. కేంద్రీయ వైద్యశాల, అనెక్స్ భవనం అవసరాలకు కూడా ఈ విద్యుత్‌నే వాడుకుంటున్నారు. ఈ మొత్తం అవసరాలకు గాను నెలకు సరాసరి 1.20 లక్షల యూనిట్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.8.40 లక్షలను విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సౌరవిద్యుత్ ప్లాంటును ఏర్పాటుచేసి విద్యుత్ ఖర్చును తగ్గించుకోవాలని తితిదే నిర్ణయించింది. దాతలు ముందుకు రావడంతో వారిచ్చిన విరాళాలతోనే ప్లాంటును నెలకొల్పింది. ఈ ప్లాంటుకు అయిన మొత్తం ఖర్చు రూ.1.25 కోట్లు. ఇందులో ఎల్ అండ్ టి సంస్థ రూ.75 లక్షలు విలువైన పరికరాలు, ఏయోన్ రెనెవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, క్రక్స్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలు కలిపి రూ.50 లక్షలు విలువైన 50 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సౌర ఫలకాలు విరాళంగా అందించాయి.
ఈ ప్లాంటు నుండి సంవత్సరానికి రూ.10.50 లక్షల విలువైన సుమారు 1.50 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్లాంటు కాలపరిమితి 25 సంవత్సరాలు. ఈ సౌరవిద్యుత్ ప్లాంటు ఏర్పాటుతో సంవత్సరానికి 100 టన్నుల కార్బన్ ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.