TTD GOSHALA TO BE MADE A KNOWLEDGE AND RESEARCH HUB OF INDIGENOUS COW BREEDS-TTD EO _ పలమనేరు గోశాలలో దేశీయ గోజాతుల అభివృద్ధి: టిటిడి ఈవో
INSPECTS THE GOSHALA AT PALAMANER
TIRUPATI, 15 JULY 2021: The TTD Goshala located at Palamaner will be made into a state-of-art knowledge and Research Hub for the promotion of Desi cow breeds, said TTD EO Dr KS Jawahar Reddy.
The TTD EO visited the Goshala located in a 450 acres sprawling area at Palamaner on Thursday.
Speaking on the occasion TTD EO said TTD will undertake an awareness campaign among farmers on Panchagavya products from Desi breeds so that the new enterprise would be profitable to farmers.
The EO said 1000 desi cows and bulls at the SV Goshala in Tirupati will also be shifted to Palamaner and directed the officials to construct necessary sheds for upkeep the same.
He said the Goshala would be promoted as a Watershed project in collaboration with the Rural
Development department and appealed to donors and corporate groups to contribute for the development of the infrastructure at the Goshala. He also invited the field experts to become partners with the TTD in the promotion of indigenous breeds.
Additional EO Sri AV Dharma Reddy, Chief Engineer Sri Nageswara Rao, Goshala Director Dr Harnath Reddy, SE Sri Jagdishwar Reddy and EE Sri Siva Ramakrishna were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
పలమనేరు గోశాలలో దేశీయ గోజాతుల అభివృద్ధి : టిటిడి ఈవో
తిరుపతి, 2021 జులై 15: టిటిడి ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటుచేసిన గోశాలలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసి గోసంరక్షణకు చర్యలు చేపడుతున్నామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. గురువారం పలమనేరులోని టిటిడి గోశాలను ఈవో సందర్శించారు. దేశవాళీ గోవులను, వృషభాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పలమనేరులోని ఎస్వీ గోశాలకు పశువైద్య విశ్వవిద్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు కేటాయించిందన్నారు. ఇక్కడ దేశవాళీ గోజాతుల అభివృద్ధి, గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తుల తయారీ చేపడతామని తెలిపారు. వీటిపై రైతులకు అవగాహన కల్పిస్తామని, తద్వారా రైతులకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని చెప్పారు. ఇక్కడి గోశాలకు వెయ్యికి పైగా దేశీయ గోవులు, వృషభాలు ఉన్నాయని, తిరుపతిలోని గోశాల నుండి మరో వెయ్యి గోవులను తరలిస్తామని వెల్లడించారు. ఇందుకోసం అవసరమయ్యే షెడ్లు తదితర నిర్మాణాలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. గోశాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తామన్నారు. ఈ గోశాలను వాటర్‌షెడ్‌గా పరిగణించి గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో మరింత అభివృద్ధి చేపడతామని చెప్పారు. కార్పొరేట్ సంస్థలు, దాతలు ఈ గోశాలలో మౌలిక వసతులు పెంచేందుకు ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా, అంకితభావం గల నిపుణులైన శాస్త్రవేత్తలు ముందుకొచ్చి దేశీయ గోజాతులను అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈఓ వెంట టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, ఎస్ఇ శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఇఇ శ్రీ శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.