TTD HAS NOTHING TO DO WITH SEIZED HAIR _ మేం తలనీలాలు విక్రయిస్తాం అంతే
Tirumala, 30 Mar. 21: TTD on Tuesday clarified that the recent seizure of 120 bags of tonsured human hair on the borders of Mizoram-Myanmar by Assam Rifles has nothing to do with TTD.
TTD said all of its stock of tonsured hair donated by devotees as part of their vow is being sold on the e-auction platform to international bidders.
Many temples in the country do carryout sale of human hair offered by devotees. TTD also executes human hair sale on e-platform for every three months and it is a routine process, TTD stated.
TTD hands over the hair stock through e-tenders to the bidders after deducting prescribed GST. Thereafter TTD will not interfere on issues like whether the bidder possessed international export permits or where all they dispose of their stock once it is sold.
TTD has also said that it will blacklist the names of companies if the authorities officially declare them.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మేం తలనీలాలు విక్రయిస్తాం అంతే
టీటీడీ స్పష్టీకరణ
తిరుమల 30 మార్చి 2021: మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో పోలీసులు సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలు ( వెంట్రుకలతో) తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
టీటీడీ తన వద్ద ఉన్న తలనీలాలను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తుంది. టెండర్ లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్ నుంచి జి ఎస్ టి కట్టించుకుని తలనీలాలు అప్పగించడం జరుగుతుంది. కొనుగోలు చేసిన బిడ్డర్ కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులు ఉన్నాయా ? లేక దేశంలోనే ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదు.
దేశంలోని అనేక ఆలయాలలో తలనీలాల విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే టీటీడీ కూడా ప్రతి మూడు నెలలకోసారి ఈ టెండర్ ద్వారా తలనీలాలు విక్రయిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.
సంబంధిత అధికారులు తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాము..
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది