TTD JEO AT WOMEN TRAINING ON DRY FLOWER TECHNOLOGY _ దేవతామూర్తుల చిత్ర పటాలు తయారు చేసే అవకాశం రావడం మీ అదృష్టం – మహిళల శిక్షణా కార్యక్రమంలో టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

Tirupati, 28 September 2021: TTD Joint Executive Officer (Education & Health) Sri Sada Bhargavi said that the women trainees are blessed to learn the making of products from used flowers in TTD-sub-temples.

 

She was addressing trainees at the Citrus Research Center of Dr YSR horticultural University, near Perur in Chittoor district. TTD has signed an MoU with the University last month to make portraits of gods, paperweights, and key chains with the dry flower technology imparted by the university.

 

Participating as chief guest the TTD JEO said there was a spontaneous and good response for the agarbattis made from used flowers of the TTD temples and was confident that the production of portraits and other products from used flowers will also become popular. She said local women are selected for the training program in view of their devotion to Sri Venkateswara.  

She reiterated that TTD is not engaged in the task for sake of revenue or enterprise but only with the sacred vision to present Swami Pushpa Prasadam to devotees. She said that TTD EO Dr KS Jawahar Reddy had conceived the program for benefit of devotees.

 

Dr Janakiraman, vice-chancellor of Dr YSR Horticultural University who participated in the program via virtual link said the MoU was aimed at taking endeavours of TTD to another level of devotee-friendly environment. He said the enterprise of making useful goods from used flowers has the potential of becoming an industry soon.

 

SV Veterinary University Vice-chancellor Dr V Padmanabha Reddy, Horticultural University registrar Dr K Gopal. Director of Research Dr R V S K Reddy, Zonal Research Head Dr K T V Venkataramana, Principal Scientist Dr E Karunasri, Director of Extension Dr B Srinivasulu, scientist Dr M Vidya Rani, Citrus Research Centre In-charge Dr Nagraj and TTD DyEO Sri Ramana Prasad were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

దేవతామూర్తుల చిత్ర పటాలు తయారు చేసే అవకాశం రావడం మీ అదృష్టం
 
–  మహిళల శిక్షణా కార్యక్రమంలో టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి
 
తిరుపతి  28 సెప్టెంబర్ 20 21: టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవతామూర్తుల చిత్ర పటాలు తయారుచేసే అవకాశం  రావడం మహిళలకు పూర్వజన్మ సుకృతమని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అన్నారు. పేరూరు సమీపంలోని చీనీ నిమ్మ పరిశోధన కేంద్రంలో మంగళవారం మహిళలకు ఏర్పాటు చేసిన మూడు రోజుల  శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవతామూర్తుల చిత్రపటాలు, పేపర్ వెయిట్ లు,  కీ చైన్లు తదితరాలు తయారు చేయడం కోసం టీటీడీ  డాక్టర్ వైయస్ఆర్ horticulture విశ్వవిద్యాలయంతో గత నెల 13వ తేదీ ఎంఓయు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వినియోగించిన పుష్పాలతో   చిత్ర పటాలు ఇతర వస్తువులు తయారుచేసే మహిళలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా జెఈవోమాట్లాడుతూ,  టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేస్తున్న అగరబత్తీలకు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఇదే తరహాలో దేవతామూర్తుల చిత్రపటాలు,  వస్తువుల తయారీకి కూడా అనూహ్య స్పందన లభిస్తుందని శ్రీమతి సదా భార్గవి చెప్పారు.  మహిళలు అనుక్షణం గోవింద నామం స్మరిస్తూ పుష్పాలు  సమకూర్చడం పూర్వజన్మ సుకృతంగా ఆమె ఉద్భోధించారు. మహిళల్లో సృజనాత్మకత బాగా ఉంటుందని,  అలాగే స్థానికులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద భక్తి విశ్వాసాలు ఉంటాయి కాబట్టే స్థానిక మహిళలను ఈ శిక్షణకు ఎంపిక చేశామని ఆమె చెప్పారు. ఇది స్వామి వారు తమకిచ్చిన అదృష్టంగా సంకల్పించుకుని పనిచేయాలని చెప్పారు. టీటీడీ ఆదాయం కోసమో, వ్యాపారం కోసమో ఈ పని చేయడం లేదని,  స్వామివారి పుష్ప ప్రసాదాన్ని భక్తులకు అందించే బృహత్తర కార్యక్రమం గా బావిస్తోందని ఆమె వివరించారు. 
 
 కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో టిటిడి లో ఉపయోగించిన పుష్పాలను స్వామి వారి ప్రసాదం గా భక్తులకు అందించే  ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.
 
డాక్టర్ వైయస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జానకిరామ్ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్  వైయస్సార్ విశ్వవిద్యాలయం టీటీడీ తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరమైన పరిణామం అన్నారు.  వినియోగించిన పుష్పాలతో తయారు చేయబోయే చిత్రపటాలు, ఇతర వస్తువులకు  భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని,  ఇదో పెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందుతుందన్నారు. పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి పద్మనాభరెడ్డి,  ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె గోపాల్,  డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఆర్ వి ఎస్ కె రెడ్డి, జోనల్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ కె టి వి వెంకటరమణ,  ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఈ. కరుణ శ్రీ,  డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ బి శ్రీనివాసులు, సైంటిస్ట్ డాక్టర్ ఎం విద్యా రాణి, చీనీ నిమ్మ పరిశోధన కేంద్రం ఇంచార్జ్ డాక్టర్ నాగరాజు,  టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ రమణ ప్రసాద్ పాల్గొన్నారు. 
 
టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.