TTD JEO INSPECTS ARRANGEMENTS FOR GARUDA SEVA _ గ‌రుడ‌సేవ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టీటీడీ జేఈవో శ్రీ వి.వీర‌బ్ర‌హ్మం

TIRUPATI, 11 FEBRUARY 2026: TTD Joint Executive Officer Sri  Veerabrahmam on Wednesday night inspected the arrangements being made for the Garuda Seva scheduled to be held on Thursday night as part of the ongoing Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy.

Accompanied by CVSO Sri Muralikrishna and District SP Sri Subbarayudu, the JEO reviewed the arrangements along the four Mada Streets surrounding the temple. 

He examined the measures taken to ensure that devotees attending the Garuda Seva do not face any inconvenience.

The officials reviewed the deployment of additional security personnel, parking facilities, and traffic regulation arrangements, and issued necessary instructions to streamline the management of the event.

The JEO also directed the concerned officials to ensure adequate supply of Annaprasadams, drinking water, and buttermilk for devotees. 

The JEO instructed to enhance sanitation measures by deploying additional staff and setting up temporary toilets for the convenience of pilgrims.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

గ‌రుడ‌సేవ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టీటీడీ జేఈవో శ్రీ వి.వీర‌బ్ర‌హ్మం

తిరుపతి, 2026 ఫిబ్రవరి 11: శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జ‌రుగ‌నున్న గరుడసేవ సందర్భంగా ఆల‌య నాలుగు మాడ వీధుల‌ను జేఈవో శ్రీ వి.వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌, జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడుతో క‌లిసి బుధ‌వారం రాత్రి త‌నిఖీలు నిర్వ‌హించారు.  

గ‌రుడ‌సేవ‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండ టీటీడీ చేసిన ఏర్పాట్లను ప‌రిశీలించారు. ఇందులో భాగంగా అద‌న‌పు భ‌ద్ర‌తా సిబ్బంది, పార్కింగ్ , ట్రాఫిక్ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. అదేవిధంగా భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌జ్జిగ అందివ్వాల‌ని, మెరుగైన పారిశుద్ధ్యం కొర‌కు అద‌న‌పు సిబ్బంది, తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.    

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.