TTD LAUNCHES WHATSAPP-BASED FEEDBACK SYSTEM FOR PILGRIMS _ భక్తుల అభిప్రాయాల కోసం టీటీడీ కొత్త వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం
TIRUMALA, 30 APRIL 2025: Tirumala Tirupati Devasthanams TTD has introduced a new WhatsApp Feedback System to streamline and enhance the process of collecting feedback from pilgrims visiting Tirumala and Tirupati. This initiative aims to improve transparency, service quality, and devotee satisfaction.
Pilgrims can now conveniently share their feedback by simply scanning QR codes placed at various locations across Tirumala and Tirupati. Upon scanning, they will be directed to a WhatsApp interface where they can submit their feedback in a few simple steps.
Pilgrims will be prompted to:
• Enter their Name
• Select a Service Category (such as Anna Prasadam, Cleanliness, Kalyan Katta, Laddu Prasadam, Luggage, Rooms, Q-Line, or Overall Experience)
• Choose the Feedback Medium – either text message or video upload
• Rate the service as Good, Average/Could Be Better, or Not Good
• Provide additional comments (up to 600 characters) or upload a video
• Once the feedback is submitted, the system will confirm receipt with a message stating: “Your feedback has been recorded successfully. Thank you for the valuable feedback.”
TTD management will thoroughly review all feedback received and take necessary actions to address concerns and improve services.
This digital initiative is part of TTD’s continued commitment to providing a spiritually enriching and comfortable experience to all devotees.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తుల అభిప్రాయాల కోసం టీటీడీ కొత్త వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం
తిరుమల, 2025 మే 02: భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఓ కొత్త ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు.
ఫీడ్‌బ్యాక్ విధానం
• తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే వాట్సాప్‌లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది.
• ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి.
• అనంతరం, అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ ను ఎంచుకోవచ్చు.
• సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు/మరింత మెరుగుదల అవసరం, లేదా బాగాలేదు గా రేట్ చేయాల్సి ఉంటుంది.
• భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్‌లోడ్ చేయవచ్చు.
• అభిప్రాయం సమర్పించిన వెంటనే, “మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది. మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌కు ధన్యవాదాలు” అనే ధృవీకరణ సందేశం వస్తుంది.
భక్తుల నుండి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణనలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.