TTD LIMITS SRIVANI QUOTA FROM JULY 22 ONWARDS _ జూలై 22వ తేదీ నుండి ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసిన టీటీడీ

TIRUMALA, 18 JULY 2024:In view of the increasing pilgrim crowd to Tirumala, TTD has decided to reduce the SRIVANI Trust tickets, which comes into effect from Monday onwards.
 
The online quota of SRIVANI tickets remains the same at 500 while among the daily quota of 1000 tickets offline, 100 will be issued at Tirupati airport and 900 at Gokulam Rest House in Tirumala.
 
The devotees are requested to make note of this and co-operate with TTD.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూలై 22వ తేదీ నుండి ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసిన టీటీడీ

– ఆన్ లైన్ లో 500 టికెట్లుతిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేసింది.

తిరుమల, 2024 జూలై 18: ఇందులో భాగంగా ఆన్ లైన్ లో 500 (ఇదివరకు ఉన్నట్లే), ఆఫ్ లైన్ లో మరో 1,000 టికెట్లను మాత్రమే జారీ చేస్తారు.

దీనిలో తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు.

మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టిక్కెట్లు జారీ చేస్తారు.భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.