TTD MAKES EXTENSIVE ARRANGEMENTS FOR SRI VARALAKSHMI VRATAM AT TIRUCHANUR _ శ్రీ వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు

TTD CHAIRMAN SRI B.R.NAIDU DIRECT OFFICIALS TO ENSURE HASSLE-FREE DARSHAN AND SERVICES FOR DEVOTEES

Tirupati, August 5, 2026: TTD Chairman Sri B.R. Naidu has directed officials to make comprehensive arrangements for the Sri Varalakshmi Vratam to be held at Sri Padmavathi Ammavari Temple, Tiruchanur, on August 21, ensuring that thousands of devotees participate in the sacred ritual without any inconvenience.

On Wednesday, the temple officials and priests met the Chairman at his camp office in Tirumala and formally invited him to the festival.

The Chairman instructed officials to provide adequate drinking water, Annaprasadam, well-managed queue lines, security, sanitation, medical services and traffic regulation. He stressed that all departments should work in close coordination to enable devotees to observe the vratam in a peaceful and devotional atmosphere.

He also directed the officials to beautifully decorate the temple and the Asthana Mandapam with flowers to create a spiritually uplifting ambience for the occasion.

Later, the temple priests blessed the Chairman and his spouse with Vedic chants. Temple Deputy EO Sri Harendranath presented them with silk garments and handed over the invitation for the Sri Varalakshmi Vratam Mahotsavam.

Temple priest Sri Babu Swamy and other officials were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

శ్రీ వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు

భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి : టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

తిరుపతి, 2026 ఆగస్టు 05: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరగనున్న పవిత్ర శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు.

బుధవారం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవానికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, సక్రమమైన క్యూ లైన్లు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వ్రతంలో పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, వ్రతం నిర్వహించే ఆస్థాన మండపాన్ని సుందరమైన పుష్పాలంకరణలతో శోభాయమానంగా అలంకరించి, మహోత్సవానికి తగిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.

అనంతరం చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వచనం అందజేశారు.

ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ పట్టువస్త్రాలు సమర్పించి, శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది