TTD OFFERS SARE TO MUCCHINTAL TIRUMALA DIVYA DESAM _ ముచ్చింతల్ లో శ్రీవారి దివ్య క్షేత్రం ప్రారంభం

CHAIRMAN, EO TAKES PART

TIRUMALA, 13 FEBRUARY 2022: TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Dr KS Jawahar Reddy offered silk vastrams to Mucchintal Tirumala Divya Desam on Sunday on behalf of Tirumala Tirupati Devasthanams.

They presented the sare to Tridandi Chinna Jeeyar Swamiji who decked the sacred vastram to Mula Virat of Sri Venkateswara Swamy in the Divya Desam.

It may be mentioned here that 108 Sri Vaishnava Divya Desams were constructed in Mucchintal and the inaugurated of Tirumala Divya Desam took place on Sunday.

TTD Board members Sri Bhaskar Reddy, Sri K Ramabhupal Reddy, DEO Sri Govindarajan, Secunderabad Oriental College Principal Sri Hemanth Kumar were also present.

Nadu Nedu photo expo by TTD gets reception

The photo exhibition displayed by TTD in Mucchintal with the concept Nadu-Nedu has been receiving overwhelming response from devotees. The photos portraying old ad new Tirumala has won appreciation.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ముచ్చింతల్ లో శ్రీవారి దివ్య క్షేత్రం ప్రారంభం

– శ్రీవారి ఆలయం నుంచి వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందించిన టీటీడీ చైర్మన్, ఈవో

తిరుమల 13 ఫిబ్రవరి 2022: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి నిర్మించిన 108 దివ్య క్షేత్రాల్లో ఒకటైన తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రాన్ని ఆదివారం ప్రారంభించారు. శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన వస్త్రం, తీర్థప్రసాదాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామికి అందించారు. ఆయన వస్త్రాన్ని శ్రీవారి విగ్రహానికి అలంకరించారు. శాసన సభ్యులు , టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, దేవస్థానం విద్యాధికారి శ్రీ గోవింద రాజన్, సికింద్రాబాద్ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ హేమంత్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫోటో ఎగ్జిబిషన్ కు అనూహ్య స్పందన

దివ్య దేశాల ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కు సందర్శకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తిరుమల నాడు – నేడు అంశంపై శ్రీవారి ఆలయంతో పాటు పలు ప్రాంతాలు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తూ ఏర్పాటు చేసిన ఫోటోలు కళ్ళకు కట్టినట్లు ఉన్నాయని సందర్శకులు అభినందనలు తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది