TTD PARADE GROUNDS TO HOST I-DAY FETE _ టీటీడీ పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

TIRUPATI, 14 AUGUST 2024: The Parade Grounds of the TTD Administrative Building in Tirupati is spruced up to host the 78th Independence Day celebrations on August 15.

The programs will commence by 8:30am followed by the hoisting of the National Flag by the Executive Officer of TTD and delivers his I-DAY speech on the occasion.

The series of events includes Cultural programs by TTD students, March, Special feat by security personnel, sniffer dogs which allures the spectators.

Later the employees who excelled in discharging their duties will be presented with the appreciation certificates and medals.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2024 ఆగష్టు 14: ఆగస్టు 15న నిర్వహించే 78వ భారత స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలకు టీటీడీ సిద్ధమయింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల పరేడ్‌ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు. గురువారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.

జెండా వందనం అనంతరం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. చివరగా టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.