TTD SPORTS COMPETITIONS ENTERS DAY 2 _ టిటిడి క్రీడాపోటీల్లో క్యారమ్స్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్ విజేతలు

Tirupati, 10 February 2026: Carroms, Kabaddi and Shuttle competitions were held on Tuesday in the annual sports organized for TTD employees. 

The details of the competitions are as follows.

•  In the Kabaddi competition for male employees, the team of Sri Pratap Kumar won, while the team of Sri Mohan Babu stood as the runner-up.

•  In the Passing Luggage competition for female employees above 45 years of age, Smt. Kavita won, while Smt. Shanti stood as the runner-up.

•  In the Tennis Singles competition for female employees below 45 years of age, Smt. Sridevi won, while Smt. Jhansi stood as the runner-up.  In the tennis doubles competition, Smt. Anuradha and Smt. Sridevi won, while Smt. Jhansi and Smt. Balamma were the runners-up.

•  In the badminton competition for retired women employees, Smt. Lalithamma and Smt. Sumati won, while Smt. Devika Rani and Smt. Lokeswari stood the runners-up.

•  In the carrom singles competition for male employees, Sri. Srikanth won, while Sri. Sunil Kumar was the runner-up. 

In the carrom doubles competition, Sri Srikanth and Sri. Chandrasekhar won, while Sri. Sunil Kumar and Sri. Nagaraju were the runners-up.

 – In the women employees’ carrom singles competition, Smt. Sampoornamamma won and Smt. Prasanna was the runner-up.

•  In the partially blind section, Sri B. Babunaidu won and Smt. Ramanjamma was the runner-up. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టిటిడి క్రీడాపోటీల్లో క్యారమ్స్‌, కబడ్డీబ్యాడ్మింటన్   విజేతలు

తిరుపతి, 2026 ఫిబ్రవరి 10: టిటిడి ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో మంగ‌ళ‌వారం క్యారమ్స్‌, కబడ్డీ, ష‌టిల్‌ పోటీలు జరిగాయి. ఆ పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.

–   పురుష‌ ఉద్యోగుల కబడ్డీ పోటీలలో శ్రీ ప్ర‌తాప్ కుమార్‌ జట్టు విజయం సాధించగా, శ్రీ మోహ‌న్‌బాబు జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.

–    45 ఏళ్లు పైబడిన మ‌హిళా ఉద్యోగుల పాసింగ్ ల‌గేజి పోటీల‌లో శ్రీ‌మ‌తి క‌విత విజయం సాధించగా, శ్రీ‌మ‌తి శాంతి  రన్నరప్‌గా నిలిచింది.

–    45 ఏళ్ల లోపు మ‌హిళా ఉద్యోగుల టెన్నికాయిట్  సింగిల్స్ పోటీల్లో శ్రీమ‌తి శ్రీ‌దేవి విజయం సాధించగా, శ్రీమ‌తి ఝాన్సీ రన్నరప్‌గా నిలిచారు. టెన్నికాయిట్ డబుల్స్‌  పోటీలలో శ్రీమ‌తి అనురాధ‌, శ్రీ‌మ‌తి శ్రీ‌దేవి విజయం సాధించగా, శ్రీమ‌తి ఝాన్సీ, శ్రీమ‌తి బాల‌మ్మ రన్నర్‌గా నిలిచారు.

–   విశ్రాంత మ‌హిళా ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీ‌మ‌తి ల‌లిత‌మ్మ‌, శ్రీ‌మ‌తి సుమ‌తి జట్టు విజయం సాధించగా, శ్రీ‌మ‌తి దేవికా రాణి, శ్రీ‌మ‌తి లోకేశ్వ‌రి జట్టు రన్నరప్ గా నిలిచింది.

–     పురుష‌ ఉద్యోగుల క్యారమ్స్‌ సింగిల్స్‌ పోటీలలో శ్రీ శ్రీ‌కాంత్  విజయం సాధించగా,  శ్రీ సునీల్‌కుమార్‌ రన్నరప్‌ నిలిచారు. క్యారమ్స్‌ డబుల్స్‌  పోటీలలో శ్రీ శ్రీ‌కాంత్‌, శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ విజయం సాధించగా, శ్రీ సునీల్‌కుమార్‌, శ్రీ నాగ‌రాజు రన్నర్‌గా నిలిచారు.

–    మ‌హిళా ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్‌ పోటీలలో శ్రీమ‌తి సంపూర్ణ‌మ్మ‌, విజయం సాధించగా, శ్రీమ‌తి ప్ర‌స‌న్న‌ రన్నరప్‌గా నిలిచింది.

–    పాక్షిక అంధుల విభాగం చెస్‌ పోటీల్లో శ్రీ బి.బాబునాయుడు విజయం సాధించగా, శ్రీ‌మ‌తి రామాంజమ్మ రన్నర్‌గా నిలిచారు.  

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.