TTD STALLS THEERTHA SNANAM IN KT _ శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ పుష్కరిణిలోకి భక్తులను తాత్కాలికంగా నిలిపివేసిన టీటీడీ
TIRUPATI, 03 NOVEMBER 2023: In view of non-stop rains following the Cyclone Michaung effect, the waters is gushing out in Sri Kapilathirtham in Tirupati.
In view of devotee safety, TTD has temporarily stalled the permission for devotees taking holy bath in this torrent waters till the situation turns to normalcy.
The devotees are requested to make note of this and co-operate with TTD management.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ పుష్కరిణిలోకి భక్తులను తాత్కాలికంగా నిలిపివేసిన టీటీడీ
తిరుపతి, 2023 డిసెంబరు 03: తిరుపతిలో గత రెండు రోజులుగా మైచాంగ్ తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా కపిలతీర్థంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు పుష్కరిణి నీటిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల అనుమతిని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది.
కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.