TTD TO BRING ASTADASA PURANAMS INTO LIMELIGHT _ త్వరలో భక్తులకు అందుబాటులో అష్టాదశ పురాణాలు జెఈవో(విద్య , ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి
Tirupati, 30 Dec. 20: In a noble move, TTD is all set to bring out Astadasa Puranas into public domain, said JEO for Health and Education Smt Sada Bhargavi.
The JEO reviewed on the book works which under progress with Purana Ithihasa project of TTD with the Scholars at SVETA in Tirupati on Wednesday.
She expressed satisfaction over the progress of works. Scholars said already Agni Puranam is nearing completion while Vishnu Puranam and Brahma Puranam also under pipeline. She directed them to also work on Matsya Puranam and get it ready for publishing.
Pura Ithihasa Project Special Officer Dr Dakshinamurthy Sharma, SVETA Director Sri Ramanjulu Reddy also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
త్వరలో భక్తులకు అందుబాటులో అష్టాదశ పురాణాలు జెఈవో(విద్య , ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2020 డిసెంబరు 30: అష్టాదశ పురాణాలను వీలైనంత త్వరగా తెలుగులో అనువాదం చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాలని జెఈవో(విద్య , ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి పండితులను కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో అష్టాదశ పురాణాలను అనువదిస్తున్న పండితులతో జెఈవో సమీక్షించారు.
జెఈవో మాట్లాడుతూ పురాణాల అనువాదంలో జరుగుతున్న ప్రగతిని అభినంధిస్తూ, మరింత త్వరగా వీటిని పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం పండితులు అగ్ని పురాణాన్ని పరిష్కరిస్తున్నారన్నారు. త్వరలో విష్ణు పురాణం, బ్రహ్మపురాణంలోని రెండు భాగాలను పరిష్కరించాలన్నారు. మత్స్య పురాణ ముద్రణను పూర్తి చేసి త్వరగా అవిష్కరించాలని సూచించారు.
ఈ సమావేశంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా. దక్షిణమూర్తి శర్మ, శ్వేత డైరెక్టర్ డా.రామాంజుల రెడ్డి, పండితులు, అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.