TTD TO DEVELOP VEDA PATHASHALA IN KEESARAGUTTA _ కీసరగుట్ట వేద పాఠశాల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపండి : ఇంజినీరింగ్ అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం
Tirumala, 15 February 2021: After his inspection at TTD Veda Pathashala in Keesaragutta on Monday, the EO Dr KS Jawahar Reddy instructed the Engineering Officials concerned to send proposals to take up development works of the Vedic institution.
The Principal Sri D Mallikarjuna Avadani informed EO that the Hostel building accommodates only 40 pupils whereas there are 120 students studying at present in Veda Pathashala at Keesaragutta. He also sought EO that necessary barricading might be provided to prevent the entry of wild beasts into Yagashala and Vedapathashala premises. EO directed the officials concerned to send a proposal plan to take up the development works.
Later the Vedic students brought to the notice of TTD EO that though they have become accomplished pundits after pursuing eight years Vedic course in TTD, they are denied employment in Vedic related posts by the Endowments Department of Telangana State. EO told them that he will definitely discuss the issue in the ensuing TTD Trust Board Meeting which is slated on February 27.
The EO had darshan of Sri Ramalingeswara Swamy in Keesaragutta. He also visited TTD Information Centre, Kalyana Mandapam, Guest House, Dining Hall which are under renovation. The officials concerned informed the EO that the works will be completed by this April. Later he also visited the SVBC Studio, HDPP Office and interacted with the employees.
Medchal Malkajgiri Additional Joint Collector Sri Vidyasagar, TTD DyEE Sri Nagaraju, AEO Sri C Naik, D Mallikarjuna Avadani Principal, AEO Sri Ramesh, Manager of Kalyana Mandapam Sri Ramesh were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కీసరగుట్ట వేద పాఠశాల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపండి : ఇంజినీరింగ్ అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం
తిరుమల 15 ఫిబ్రవరి 2021: కీసరగుట్ట లోని టీటీడీ వేద పాఠశాలలో అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వేద పాఠశాల హాస్టల్ భవనం, తరగతి గదులు, ప్రార్థన మందిరం, భోజనశాలను పరిశీలించారు. వేద పాఠశాల ప్రాంగణం మొత్తం తిరిగారు.
వేద పాఠశాల హాస్టల్ భవనం 40 మంది విద్యార్థుల కోసం నిర్మించారని ప్రస్తుతం 120 మంది విద్యార్థులు ఉన్నారని ప్రిన్సిపల్ శ్రీ మల్లిఖార్జున అవధాని ఈవోకు వివరించారు. అదనపు తరగతి గదులు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. యాగశాల, పాఠశాల పరిసరాల్లోకి వన్యమృగాలు రాకుండా ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. ఈ పనులన్నింటికి అంచనాలు తయారుచేసి పంపాలని ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ఈవో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద విద్యార్థులు మాట్లాడుతూ టీటీడీ వేద పాఠశాలలో 8 సంవత్సరాల వేదం పూర్తి చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్ లను తెలంగాణ దేవాదాయశాఖ పరిధిలో నిర్వహించే ఉద్యోగ నియామకాలకు అంగీకరించడం లేదని విన్నవించారు. ఈ సమస్య పరిష్కరించాలని వారు కోరారు. ఈ నెల 27వ తేదీ నిర్వహించే పాలకమండలి సమావేశంలో ఈ విషయం గురించి చర్చించి న్యాయం చేస్తామని ఈవో చెప్పారు.
అనంతరం హైదరాబాద్ లోని సమాచార కేంద్రాన్ని ఈవో తనిఖీ చేశారు. కళ్యాణ మండపం, గెస్ట్ హౌస్, భోజన శాలలో జరుగుతున్న పనులను పరిశీలించి, ఎప్పటికి పూర్తి అవుతాయని అధికారులను అడిగారు. ఏప్రిల్ లోగా పూర్తి అవుతాయని అధికారులు చెప్పారు. ఎస్వీబీసీ కార్యాలయం, స్టూడియో, డిపిపి కార్యాలయం పరిశీలించి ఉద్యోగులతో మాట్లాడారు.
మేడ్చల్ మల్కాజిగిరి అదనపు జాయింట్ కలెక్టర్ శ్రీ విద్యాసాగర్, టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీ నాగరాజు, ఏఈ శ్రీ చలమా నాయక్, ఏఈవో శ్రీ యు రమేష్, కల్యాణ మండపం మేనేజర్ శ్రీ రమేష్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది