TTD TO DISTRIBUTE EX-GRATIA CHEQUES ON JANUARY 12 _ జనవరి 12న తొక్కిసలాట మృతులకు టీటీడీ ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీ

CHAIRMAN APPOINTS COMMITTEES WITH BOARD MEMBERS

Tirumala, 11 January 2025: As decided by TTD Board to distribute ex-gratia to the families of the victims of Tirupati Stampede incident, the distribution of the cheques for the same commences on January 12.

In this regard, a meeting was held under the chairman of TTD Trust Board Chief Sri BR Naidu in his camp office at Tirumala with the board members on Saturday afternoon.

The TTD Chairman has formed two committees with a few board members to personally visit and distribute the ex-gratia cheques of Rs. 25lakh each to the six families of stampede victims along with the local legislators.

The team visiting Vizag and Narsipatnam includes board members Sri Jotula Nehru, Sri Janga Krishnamurthy, Smt Panabaka Lakshmi, Smt Janaki Devi, Sri Mahender Reddy, Sri MS Raju and Sri Bhanu Prakash Reddy.

While the Committee of board members visiting Tamilnadu and Kerala includes Sri Rama Murty, Sri Krishnamurthy Vaidyanathan, Sri Naresh Kumar, Sri. Shanta Ram, Smt Suchitra Ella.

The committees will also verify and gather the job and education details of the respective families to provide one contract job for one persons in each family as well free education in TTD institutions.

Besides these two teams will also disribute the exgratia cheques for Rs. 5lakh and Rs. 2lakh to the seriously and partially injured respectively.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 12న తొక్కిసలాట మృతులకు టీటీడీ ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీ

తిరుమల, 2025 జనవరి 11: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించిన మేరకు జనవరి 12 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది.

ఈ మేరకు శనివారం మధ్యాహ్నం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్‌నాయుడు ఆధ్వర్యంలో బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ఆరుగురు మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు స్వయంగా వారిని సందర్శించి ఎక్స్ గ్రేషియా చెక్కులను పంపిణీ చేసేందుకు కొంతమంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు.

వైజాగ్ మరియు నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యులు శ్రీ జోతుల నెహ్రూ, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి జానకీ దేవి, శ్రీ మహేందర్ రెడ్డి, శ్రీ ఎం ఎస్ రాజు మరియు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు.

తమిళనాడు మరియు కేరళను సందర్శించే బోర్డు సభ్యుల కమిటీలో శ్రీరామమూర్తి, శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్, శ్రీ నరేష్ కుమార్, శ్రీ శాంత రాం, శ్రీమతి సుచిత్ర ఎల్లా ఉన్నారు.

వీరు ఆయా ప్రాంతాల్లోని మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి, స్థానిక శాసనసభ్యులతో కలిసి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కులను అందించనున్నారు.

అదే విధంగా ఈ కమిటీలు ప్రతి కుటుంబంలో ఒకరికి ఒక కాంట్రాక్టు ఉద్యోగంతో పాటు టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి సంబంధిత కుటుంబాల ఉద్యోగ, విద్యా వివరాలను కూడా ధృవీకరించి సేకరిస్తాయి.

అంతే కాకుండా ఈ కమిటీ సభ్యులు తీవ్రంగా గాయపడిన భక్తులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను మరియు పాక్షికంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చెక్కులను కూడా పంపిణీ చేయనున్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడినది