TTD TO SELL AGARBATTIS BY SEPTEMBER 1st WEEK _ సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో భ‌క్తుల‌కు అందుబాటులో టిటిడి అగ‌ర బ‌త్తులు

AGREEMENT ON PANCHAGAVYA PRODUCTS BY AUGUST END -TTD EO

Tirumala, 23 Aug. 21: TTD will commence the sale of Agarbattis made from used flower garlands of TTD temples by first week of September, said TTD EO Dr KS Jawahar Reddy.

Addressing a review meeting on the activities of SV Go Samrakshanasala and Ayurveda college with the respective officials at his chambers in TTD administrative building on Monday, the TTD EO said that the agarbattis (incense sticks) should be made available at Tirumala laddu counters, coconut counters, Goshala, Sri Padmavati temple at Tiruchanoor, Sri Govindaraja swamy temple, Vishnu Nivasam and Srinivasam in Tirupati for sale.

TTD has commenced the manufacturing of agarbattis in Tirupati in collaboration with Bangalore based Darshan International Limited.

He said TTD has also tied up with Coimbatore based M/s Ashirwad company for production of 15 types of Pancha gavya products.

He directed the officials to finalise terms and conditions of the deal and also to complete all civil and electrical works in the DPW stores.

TTD EO also reviewed the licensing, packing and marketing of the Panchagavya products.

He asked officials to ready prominent Panchagavya products for markets viz. Divya Mangala- Dhoop churnam, agarbatti, Sambhrani cups, Dhoop sticks, Dhoop cones, Aishwarya-Vibhuti, Parimala- Herbal Toothpowder, Face pack, Soap, Shampoo, Sanjivini- Nasal drops, Go-thirtha- Go Ark, Pavani-Herbal floor cleaner, Gopala- Cow dung cake, Cow dung balls etc.

FA&CAO Sri O Balaji, CE Sri Nageswara Rao, SV Diary farm Director Dr Harnath Reddy, Ayurveda college Principal Dr Murali Krishna were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో భ‌క్తుల‌కు అందుబాటులో టిటిడి అగ‌ర బ‌త్తులు

– పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల‌పై ఈ నెల‌లోనే ఒప్పందం

– టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమ‌ల‌, 2021 ఆగ‌స్టు 23: టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పూల మాలలతో తయారు చేసే ప‌రిమ‌ళ‌భ‌రిత‌మైన అగర బత్తులు సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డానికి ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలోని తన చాంబర్లో సోమ‌వారం గో సంర‌క్ష‌ణ శాల‌, ఆయుర్వేద క‌ళాశాల‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బెంగుళూరుకు చెందిన ద‌ర్శ‌న్ సంస్థ స‌హ‌కారంతో ఈ అగ‌ర బ‌త్తుల‌ను త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్ల‌తో రూపొందించిన ఏడు ర‌కాల బ్రాండ్ల‌తో త‌యారు చేసిన అగ‌ర బ‌త్తులు సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో విక్ర‌యించ‌డానికి ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లో ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద‌, కొబ్బ‌రికాయ‌ల కౌంట‌ర్ వ‌ద్ద‌, గోశాల వ‌ద్ద‌, అదేవిధంగా తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, విష్ణునివాసం, శ్రీ‌నివాసంల‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాల‌న్నారు.

అనంత‌రం ఈవో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల‌పై స‌మీక్షించారు. కొయంబ‌త్తురుకు చెందిన ఆశీర్వాద్ సంస్థ స‌హ‌కారంతో ఎస్వీ ఆయుర్వేద ఫార్మ‌సీ 15 ర‌కాల పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి ఈ నెల‌లోనే విధివిదానాలు రూపొందించాల‌న్నారు. ఇందుకోసం డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌లో అవ‌స‌ర‌మైన సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్ ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల‌కు సంబంధించి లైసెన్స్‌, ప్యాకింగ్‌, మార్కెటింగ్ త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు.

పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులైన దివ్య మంగ‌ళ – ధూప్‌చూర్ణం, అగరబత్తీలు, సాంబ్రాణి కప్‌లు, ధూప్ స్టిక్స్‌, ధూప్ కోన్‌లు, ఐశ్వ‌ర్య – విబూది, ప‌రిమ‌ళ – హెర్భ‌ల్ టూత్ పౌడర్, ఫేస్‌ప్యాక్‌, సోప్, షాంపూలు, సంజీవ‌ని – నాశ‌ల్ డ్రాప్స్‌, గో తీర్థ్ – గో ఆర్క్, పావ‌ని – హెర్బల్ ఫ్లోర్ క్లీనర్‌, గోపాల – ఆవు పేడ కేక్‌, ఆవు పేడ దుంగలు త‌దిత‌ర వాటిని సిద్ధంచేయాల‌న్నారు.

ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీ డైరీఫామ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ సమావేశంలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.