TTD TO TAKE STRINGENT ACTION ON MISLEADING CAMPAIGNERS IN SOCIAL MEDIA _ శ్రీవారి దర్శనం పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు
Tirumala,18 December 2021: TTD has taken strong objection to a misleading social media campaign by Bharat Marg-a YouTube channel that TTD was giving Srivari darshan to selective communities.
The same social media channel had also made a false allegation that during lockdown Srivari naivedyam was neglected for 21 days which is completely baseless.
In a clarification on Saturday, the TTD said with a noble objective to contain religious conversations, TTD had taken up a program in collaboration with Samarasata Seva Foundation to provide Srivari darshan to people belonging to SC/ST/BC and fishermen communities from backward regions of the state during annual Brahmotsavam from October 7-14 this year.
In the same spirit, TTD board has resolved to roll out a provision of Vaikuntadwara Darshan to SC/ST/BC and fishermen communities in January 2022 during Vaikunta Ekadasi.
TTD said there was no motive of dividing devotees on a caste basis and such an allegation in a social media channel is seriously condemnable.
TTD said another baseless and untruth charge made out is that the TTD has financially supported Christian pastors and also provided funds for Jerusalem Yatra and Haj Yatra.
TTD has taken up the Gosamrakshana campaign in a big way and launched programs to promote desi cow breeds at its Goshalas in Tirupati and Palamaner.
When TTD is putting its all-out efforts in preserving Sanatana Hindu dharma through its various activities, such cheap and baseless reports by certain vested interests on TTD trying to create unnecessary confusion among the devotees is condemnable.
TTD appealed to devotees to not to trust such cheap charges in social media by some miscreants and also warned that legal action will be slapped on perpetrators of such misleading and baseless posts.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
శ్రీవారి దర్శనం పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు
తిరుమల, 2021 డిసెంబరు 18: భక్తులను టీటీడీ కులాలవారీగా విభజించి తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని భారత్ మార్గ్ అనే యూట్యూబ్ ఛానల్ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని టిటిడి తీవ్రంగా ఖండిస్తోంది. సదరు యూట్యూబ్ ఛానల్ నిరాధారమైన నిందారోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.
లాక్‌డౌన్ సమయంలో 21 రోజులు శ్రీవారికి నైవేద్యం సమర్పించలేదని సదరు ఛానల్‌లో ఆరోపించడం పూర్తిగా అవాస్తవం. ఆ సమయంలో కేవలం భక్తులకు దర్శనాలు నిలిపివేశారే తప్ప స్వామి వారికి జరిగే పూజలు, కైంకర్యాలు, నైవేద్యాలు యథాతథంగా కొనసాగాయి.
సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసి మత మార్పిడులను అరికట్టేందుకు సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో 2021 అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని వెనుకబడిన మారుమూల ప్రాంతాలకు చెందిన పేద ఎస్సీ, ఎస్టీ, బిసి, మత్స్యకారులను ఉచితంగా తిరుమల కు తీసుకుని వచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం కల్పించడం జరిగింది. ఇదే తరహాలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. అంతేగానీ భక్తులను కులాలవారీగా విభజించి దర్శనం చేయిస్తున్నారని ఆరోపించడం దుర్మార్గం.
టిటిడి సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం ఫాస్టర్లను పోషిస్తోందని, జెరూసలెం యాత్ర, హజ్ యాత్రకు నిధులు అందిస్తోందనడం సత్యదూరమైన ఆరోపణ.
గోసంరక్షణ కోసం టిటిడి అనేక చర్యలు చేపడుతోంది. తిరుపతి, పలమనేరులోని గోశాలల్లో దేశవాళీ గోవుల సంరక్షణతోపాటు వాటి సంతతిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించడమైనది.
వాస్తవాలు ఇలా ఉంటే భక్తులను తప్పుదోవ పట్టించేవిధంగా తిరుమల పుణ్యక్షేత్రంపై, ప్రపంచం లో ఏ ఇతర ఆలయాల్లో లేని విధంగా ఇక్కడ అమలవుతున్న దర్శన విధానంపై కుట్ర పూరిత అవాస్తవ ప్రకటనలు చేయడం మంచిది కాదని టీటీడీ హెచ్చరిస్తోంది. ఇలాంటి అవాస్తవ ప్రచారాలు ఆరోపణలను భక్తులు విశ్వసించవద్దని టీటీడీ మనవి చేస్తోంది. భక్తులను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పోస్టులు పెట్టేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.