TTD TRUST BOARD CHAIRMAN THANKS ALL FOR THE SUPPORT IN THE LAST TWO YEARS _ రెండేళ్లలో సామాన్య భక్తుల కోసం అనేక కార్యక్రమాలు
BOARD TAKES IMPORTANT RESOLUTIONS IN ITS LAST MEET
TTD TO STATE “GOVINDUNIKI GO ADHARITA NAIVEDYAM” PROGRAMME ON A FULL SCALE
GARUDA VARADHI EXTENSION WORKS FROM KT TO ALIPIRI WITH TTD FUNDS
Tirumala, 19 Jun. 21: The TTD Trust Board under the Chairmanship of Sri YV Subba Reddy has resolved some important decisions for the benefit of the pilgrims, employees and public in general during its final meeting held at Annamaiah Bhavan in Tirumala on Saturday.
Before briefing the resolutions to media, the TTD Board Chief thanked Honourable CM of Andhra Pradesh Sri YS Jagan Mohan Reddy, all the members of the Trust Board, TTD authorities, officials, employees and everyone for extending support to the Board in executive some innovative and important works for the benefit of the pilgrims. He said though, the Board has to face a hard time due to the Corona pandemic almost from the past one and a half years, with the support from TTD officials and pilgrim public many development works were taken up.
Some excerpts from the meeting:
Ø Priority to common pilgrims was given curbing the categories of L1, L2 and L3 in VIP Break Darshan System
Ø Tirumala has been made a Plastic-free zone by completely banning the usage of plastic
Ø To weed off the ill effects of the Corona Covid 19 virus pandemic, TTD has taken up several Spiritual programmes in the last 14 months in the Nada Neerajanam platform at Tirumala by telecasting live on SVBC which boosted confidence among world devotees.
Ø Though the board thought of completing the construction of 500 temples with the help of Samarsata Foundation and Endowments department in the last two years, due to lockdown works were not taken up. However, these works will be completed in the next one year in Dalitwada, Agency and fishermen areas.
Ø The construction of the Srivari temple was taken up at many important areas to spread the glory of Srivaru. As a part of this sacred mission, the Board has also resolved to construct a temple at the Himalayas and hence did the foundation stone ceremony at Majhin village area in Jammu on June 13. The Srivari temple works will be completed here in the next one and a half years.
Ø Once the things turns to normalcy, TTD is also contemplating to construct Srivari temples in Varanasi and Mumbai in the span of the next one year.
Ø Gudiko Gomata is a huge hit among the various unique programmes taken up by the Board as it is been implemented in over 100 temples so far across the country
Ø The Board approved for the Vendi Vakili works for Varaha Swamy temple
Ø A unique programme, the Govinduniki Go Adharita Naivedyam programme will be taken up in a full-fledged manner. In this programme, the daily Naivedyam for Swami Varu will be prepared out of organic cereals and ingredients used for making holy prasadam.
Ø SVBC Kannada and Hindi Channels to be launched in two to three months
Ø @ SRIVANI Trust funds to be utilized towards construction and renovation of temples in backward areas
Ø Pilgrim Allowance to be implemented to retired pensioners of HDPP akin to regular retired employees of TTD
Ø A Committee to be constituted to look into the eligibilities of the Contract and Outsourcing employees working in TTD for regularization
Ø Removal of all unauthorized shops in Tirumala in a week’s time
Ø Honourable CM of AP will be invited to lay the foundation stone for Paediatric Hospital in Tirupati.
Ø Nod to construct 13 Kalyana Mandapams in the viable areas
Ø TTD to develop Hanuman Birth Place at Anjanadri in Tirumala
Ø To take up Garuda Varadhi extension works with the funds of TTD from Kapila Theertham to Alipiri for the benefit of the pilgrims
Ø Plying of Electric buses soon to protect the environs of Tirumala
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
రెండేళ్లలో సామాన్య భక్తుల కోసం అనేక కార్యక్రమాలు
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున హిందూ ధర్మప్రచారం
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి
తిరుమల, 2021 జూన్ 19: శ్రీ వేంకటేశ్వరస్వామివారి భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో రెండేళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహించామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున హిందూ ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రెండేళ్లుగా స్వామిసేవ, భక్తుల సేవ చేసుకోవడానికి అదృష్టం కల్పించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ధర్మకర్తల మండలి ధన్యవాదాలు తెలిపినట్టు చెప్పారు. టిటిడి వద్ద నిల్వ ఉన్న రద్దయిన నోట్ల మార్పిడి అంశం భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని, ఈ నోట్ల మార్పిడికి అనుమతించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ను తాను నాలుగుసార్లు వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశానన్నారు. రిజర్వు బ్యాంకును కూడా అనేక సార్లు సంప్రదించామని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతోపాటు రెండేళ్లలో తమ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన కార్యక్రమాలను శ్రీ వై.వి.సుబ్బారెడ్డి పలువురు బోర్డు సభ్యులు, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డితో కలిసి మీడియాకు వివరించారు. ముఖ్యాంశాలివి.
– ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడానికి ఎల్1, ఎల్2 దర్శనాలు రద్దు.
– తిరుమల పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధం. ఏడాదిగా సంపూర్ణంగా అమలు.
– ప్రపంచ ప్రజలను కోవిడ్ బారి నుంచి కాపాడాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ గత 15 నెలలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాం. వీటిలో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆశీస్సులతో త్వరలోనే ప్రజలంతా కరోనా మీద విజయం సాధిస్తారు.
– రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించదలచిన 500 ఆలయాలను కరోనా కారణంగా నిర్మించలేకపోయాం. రాబోయే ఏడాదిలో ఈ ఆలయాల నిర్మాణం పూర్తి చేసేలా తీర్మానం.
– హిందూ ధర్మప్రచారంలో భాగంగా జమ్మూలో ఇటీవల భూమిపూజ చేసిన శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేసి ఉత్తర భారతదేశంలో గొప్ప ఆలయంగా తయారుచేసేందుకు నిర్ణయం.
– వారణాశి, ముంబయిలో ఏడాదిలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు.
– గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో 100 ఆలయాలకు గోమాతలను అందించాం. మరో 40 ఆలయాలకు కూడా అందిస్తాం. దీనివల్ల ప్రజలు గోసేవ చేసుకునే అవకాశం కల్పించినట్టవుతుంది.
– తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయం వాకిలి, వాకిలిచట్రం, గర్భగృహ ప్రవేశద్వారాలకు వెండి తొడుగులు అమర్చేందుకు నిర్ణయం.
– గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం కార్యక్రమం కింద గత 45 రోజులుగా సహజ ఆధారిత పంటలతో స్వామివారికి తయారు చేస్తున్న నైవేద్యాల కార్యక్రమాన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయం. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ధర్మప్రచార పరిషత్ ద్వారా రైతులను సంసిద్ధం చేసి వారి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం.
– మూడు నెలల్లోపు ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్ల ప్రసారాలు ప్రారంభించాలని నిర్ణయం.
– దేశవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో దేవాలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు అందిస్తాం.
– తిరుపతి, తిరుచానూరులో నివసిస్తున్న అర్హత గల హెచ్‌డిపిపి పెన్షనర్లకు(పర్యవేక్షక మరియు నాన్-పర్యవేక్షక) ఇతర తితిదే పెన్షనర్ల తరహాలోనే పుణ్యక్షేత్ర భారబృతి భత్యం రూ.500/- నుండి రూ.700/-కు పెంచేందుకు ఆమోదం.
– టిటిడిలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఇదివరకే కమిటీని నియమించాం. ఈ కమిటీ విధి విధానాలతో మూడు నెలల్లో కమిటీ నివేదిక అందిస్తుంది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో భాగంగా దీన్ని అమలుచేస్తాం.
– తిరుమలలో ఉన్న అనధికారిక దుకాణాలు, తట్టలను వారం రోజుల్లో తొలగిస్తాం. దుకాణదారులు టిటిడి అనుమతించిన వ్యాపారాలు మాత్రమే చేసేలా చర్యలు.
– త్వరలో ముఖ్యమంత్రి చేతులమీదుగా స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల అభివృద్ధి పనులతో పాటు చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన, తిరుమలలో కొత్తగా నిర్మించిన బూందీ పోటు ప్రారంభోత్సవం.
– రాష్ట్రంలో కొత్తగా 13 కల్యాణమండపాల నిర్మాణానికి ఆమోదం.
– తిరుమలలోని హనుమంతుని జన్మస్థలాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం. ఈ అంశంపై ఇక మీదట ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వరాదని తీర్మానం.
– తిరుపతిలో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఆగిన చోట నుండి అలిపిరి వరకు గరుడ వారధి నిర్మాణానికి ఆమోదం. టిటిడి నిధులతో ఈ వారధి నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయం.
– కోవిడ్ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకుంటూ శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచాలని నిర్ణయం.
– తిరుమలను గ్రీన్‌హిల్స్‌గా ప్రకటించినందున ఉచిత బస్సుల స్థానంలో త్వరలో విద్యుత్ బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఆర్టిసి కూడా ఇందుకోసం 100 విద్యుత్ బస్సులు కొనుగోలుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అనుమతించారు. తిరుపతి – తిరుమల మధ్య నడిచే ప్రయివేటు ట్యాక్సీల యజమానులు టిటిడిని సంప్రదిస్తే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయించాలని నిర్ణయం.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.