TTD MOBILE APP TO BE MADE MORE POPULAR AMONG ALL DEVOTEES- JEO  _ TTDevasthanams మొబైల్ యాప్ ను ఎక్కువ మందికి తెలియజేయాలి – టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం

Tirupati, 01 February 2023: TTD JEO Sri Veerabrahmam on Wednesday directed officials that more and more devotees be empowered about the latest TTD mobile app by its display at all information centres and local temples of TTD.

Addressing a virtual conference with officials of TTD information centres and local temples, the TTD JEO said the latest mobile app,  TT Devasthanams launched by the TTD Chairman Sri YV Subba Reddy was downloaded by over ten lakh devotees within 24 hours and officials should upload more information on TTD sevas, Darshan tickets and rooms for benefit of devotees.

Among others, he instructed officials to take steps to introduce new sevas at Srivari temple inaugurated at Bhubaneswar last year and complete pending works of TTD Kalyana Mandapams there.

He also instructed officials to speed up development works at several TTD temples at Upamaka, Ananatavaram, Vontimetta, Kapileswara temple, Srinivasa Mangapuram, Tondamanadu for the upcoming festivals. 

DyEO (General) Sri Gunabhushan Reddy, Special grade DyEO Smt Varalakshmi, DyEOs Sri Lokanatham, Sri Vijay Kumar and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

TTDevasthanams మొబైల్ యాప్ ను ఎక్కువ మందికి తెలియజేయాలి – టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి, ఫిబ్రవరి 01, 2023: ఇటీవల ప్రారంభించిన TTDevasthanams మొబైల్ యాప్ గురించి ఎక్కువ మందికి భక్తులందరికీ తెలిసేలా సమాచార కేంద్రాలు, అనుబంధ ఆలయాల్లో ప్రదర్శించాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. టిటిడి సమాచార కేంద్రాలు, అనుబంధ ఆలయాల అధికారులతో జెఈఓ బుధవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ ను ఒక రోజులోనే 10 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. దీని గురించి మరింత మంది భక్తులకు తెలియజేసి టిటిడి సమాచారం, సేవలు, దర్శన టికెట్లు, గదుల బుకింగ్ ను అందుబాటులో ఉంచాలన్నారు. భువనేశ్వర్ లో గతేడాది ప్రారంభించిన శ్రీవారి ఆలయంలో నూతన సేవలను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. టిటిడి సేవలను, ఇతర సమాచారాన్ని ఆలయం వద్ద ప్రదర్శించాలని సూచించారు. ఈ ఆలయ అభివృద్ధికి స్థానిక సలహా మండలి నుండి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. పెండింగులో ఉన్న కళ్యాణ మండపం పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఉపమాక ఆలయంలో మార్చి మొదటి వారంలో జరగనున్న స్వామివారి కళ్యాణం, అనంతవరంలో ఈ నెలలో జరగనున్న నాలుగు శనివారాల పండుగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జెఈఓ చర్చించారు. వెంకటపాలెంలోని ఆలయానికి భక్తుల సంఖ్యను పెంచేందుకు వీలుగా రవాణా వసతి కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో చర్చించాలని కోరారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం, తొండమనాడులోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో త్వరలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, వీటి నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, చెక్ లిస్టును సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఫైళ్లు, టెండర్లకు సంబంధించి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ప్రతి ఆలయంలో గోపూజ కోసం ఆవు, దూడను ఏర్పాటు చేశామని, వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

వర్చువల్ సమావేశంలో డెప్యూటీ ఈఓ జనరల్ శ్రీ గుణభూషణ్ రెడ్డి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మి, డెప్యూటీ ఈవోలు శ్రీ లోకనాధం, శ్రీ విజయ కుమార్, ఆయా ఆలయాల అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.