“TTD’s PRIORITY TO VEDA PARIRAKSHANA AND GAU SAMRAKSHANA ARE LAUDABLE”-VISAKHA SHARADA PEETHAM PONTIFF _ వేద ప‌రిర‌క్ష‌ణ‌, గో సంర‌క్ష‌ణకు టీటీడీ విశేష కృషి – విశాఖ శారద పీఠాధిపతి

ODISHA CM TAKES PART IN MAHA SAMPROKSHANAM FETE OF BHUVANESHWAR TEMPLE 

“SRIVARI TEMPLE IN ODISHA IS A DIVINE BLESSING”-AP GUV 

“HINDU DHARMA PRACHARA BY TTD FROM KASHMIR TO KANYAKUMARI IN A BIG WAY”-TTD CHAIRMAN

 BHUVANESHWARA, 26 MAY 2022:  The Honourable CM of Odisha Sri Naveen Patnaik along with the Honourable Governor of Andhra Pradesh Sri Biswabhushan Harichandan took part in the celestial Vigraha Pratista and Maha Samprokshanam rituals of Sri Venkateswara temple at Bhuvaneshwar which was also graced by Sri Swaroopanandendra Saraswathi Swami of Visakha Sharada Peetham.

In his Anugraha Bhashanam on the auspicious occasion, the Pontiff complimented TTD for taking up the protection and promotion of Hindu Sanatana Dharma in a big way across the country in the form of constructing Sri Venkateswara temples, Gau Samrakshana, Veda Parirakshana etc. under the instructions of the Chief Minister of Andhra Pradesh Sri YS Jagan Mohan Reddy.

In his speech, the Honourable Governor of  Andhra Pradesh said, the newly constructed Srivari temple at Bhuvaneshwar is a benign blessing of Lord Venkateswara Himself to the denizens of Odisha. “This has facilitated those devotees who could not make their Pilgrimage to Tirumala due to their age, health, finance and any other reasons. Now the devotees shall have the blessings of Sri Venkateswara Swamy at their door steps and they could have darshan of the Universal Lord every day”, he maintained.

Speaking on the occasion, TTD Chairman Sri YV Subba Reddy said, the world-renowned Hindu Religious Organisation of Tirumala Tirupati Devasthanams(TTD) has taken up Hindu Dharma Prachara in big way and has been Conducting several Religious, Bhakthi, Dharmic activities on a large scale for the sake of well-being of entire humanity.

As a part of its chief agenda of protection and propagation of Hindu Sanatana Dharma TTD has so far constructed 501temples in the backward areas across and another 1130 temples are underway. Under the instructions of our Honourable CM Sri YS Jaganmohan Reddy, TTD has been providing them free darshan of Sri Venkateswara during important occasions.

On the other hand, TTD has also taken up Gau Samrakshana programmes in a big way including “Gudiko Gomata”, where in so far a cow and calf have been donated to nearly 171 temples across the country, “Go Puja” in all the TTD temples, a national seminar on Desi Cow Protection – GoSammelanam, “Govinduniki Go Adharita Naivedyam-preparation of Srivari Prasadams with cow-based organic farming, Panchagavya Products, Navaneeta Seva etc.

Giving a boost to our great epics, TTD has been continuously organizing the Parayanams and religious discourses that are being telecasted live on SV Bhakti Channel for the sake of global devotees and now they are being aired in Telugu, Tamil, Kannada and Hindi languages. He said TTD has so far constructed Sri Venkateswara DivyaKshetrams at New Delhi, Kurukshetra, Kanyakumari, Hyderabad, Visakhapatnam and today we opened the temple in this holy city of Bhuvaneshwar. SV temples are also coming up at Jammu and Navi Mumbai in near future”, he added.

Junior Pontiff of Visakha Sharada Peetham Sri Swatmanandendra Saraswathi, Bhuvaneshwar MP Smt Aparajita Sadangi, LAC Chief Sri Dushmant Kumar, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, Deputy EO Sri Gunabhushan, All Projects Officer Sri Vijayasaradhi, VGO Sri Manohar and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వేద ప‌రిర‌క్ష‌ణ‌, గో సంర‌క్ష‌ణకు టీటీడీ విశేష కృషి – విశాఖ శారద పీఠాధిపతి

శ్రీ‌వారి ఆల‌య నిర్మాణం భువ‌నేశ్వ‌ర్ ప్ర‌జ‌ల అదృష్టం – ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్

కాశ్మీర్ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్ర‌చారం – టీటీడీ చైర్మ‌న్‌

తిరుప‌తి, 2022 మే 26: పూర్వీకులు మ‌న‌కు అందించిన వేద విద్య‌ను టీటీడీ ప‌రిర‌క్షించి, వ్యాప్తి చేస్తోంద‌ని విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి పేర్కొన్నారు. భువ‌నేశ్వ‌ర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం మహాసంప్రోక్షణ అనంత‌రం స్వామిజి అనుగ్ర‌హ‌భాష‌ణం చేశారు.

ఈ సంద‌ర్బంగా శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి మాట్లాడుతూ ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దేశ‌వ్యాప్తంగా శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణాల‌కు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వేద పండితుల‌ను పోషిస్తూ, గో సంర‌క్ష‌ణకు, దేశావ‌ళీ గోజాతుల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఏకైక హిందూ ధార్మిక సంస్థ టీటీడీ అని చెప్పారు. సుదూర ప్రాంతాల నుండి తిరుమ‌ల వ‌చ్చి శ్రీ‌వారిని ద‌ర్శించుకోలేని భ‌క్తుల కోసం టీటీడీ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాల‌ను నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో ఒడిస్సా ప్ర‌జ‌లు అన్ని రంగాల్లో మ‌రింత‌గా అభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరించందన్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి తిరుమ‌ల‌కు వెళ్ళి శ్రీ‌వారిని ద‌ర్శ‌నం చేసుకోలేని భ‌క్తుల‌కు టీటీడీ భువ‌నేశ్వ‌ర్‌లో శ్రీ‌వారి ఆల‌యం నిర్మించ‌డం రాష్ట్ర ప్ర‌జ‌ల అదృష్టమ‌న్నారు. తిరుమ‌ల‌కు వెళ్ళి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోలేక పోయామ‌నే నిరుత్సాహం ఇక ఎవ‌రికి ఉండ‌దు. ఇలాంటి వారు భువ‌నేశ్వ‌ర్‌లోని స్వామివారిని త‌ర‌చు ద‌ర్శించుకోవ‌చ్చ‌ని చెప్పారు.

టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ భువనేశ్వర్‌లో అహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో పవిత్రమైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తిచేసే క్రమంలో కాశ్మీర్ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో 501 దేవాలయాలను టీటీడీ నిర్మించింద‌న్నారు. రాబోవు రెండు సంవ‌త్స‌రాల్లో మరో 1,130 ఆలయాల నిర్మాణానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌న్నారు. అదేవిధంగా వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు చెందిన ఆరు వేల మంది భ‌క్తుల‌కు ఉచిత ర‌వాణా, వ‌స‌తి, భోజ‌న సౌక‌ర్యాలతో శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించిన‌ట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచనల మేరకు దేశీయ గోజాతుల సంరక్షణకు, అన్ని దేవాల‌యాల్లో గో పూజ కార్య‌క్ర‌మం ఏర్పాటుకు టీటీడీ పెద్దపీట వేస్తోంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 171 ఆల‌యాల‌కు గుడికో గోమాత కార్య‌క్ర‌మం కింద గోవులు, దూడ‌లు ఉచితంగా అంద‌చేయ‌డం జ‌రిగింద‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యంలో కూడా గోవిందునికి గో ఆధారిత నైవేద్యం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌న్నారు.

హిందూ ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా టీటీడీ తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ నిర్వ‌హిస్తోంద‌న్నారు. కోవిడ్‌ సమయంలో ప్రపంచ మానవాళి రక్షణ కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ 2020 ఏప్రిల్‌ నుండి ప్ర‌త్య‌క్ష‌ ప్ర‌సారం చేస్తున్న అనేక పారాయణ కార్యక్రమాలకు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. రాబోవు రోజుల్లో దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లో శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.