TUDA CHIEF SWORNS IN AS TTD EX OFFICIO _ టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా శ్రీ దివాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం
Tirumala, May 23, 2025: Tirupati Urban Development Authority (TUDA)Chairman Sri Diwakar Reddy sworn in as ex-officio member of TTD on Friday in Tirumala temple.
The TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary administered the oath to him at the Bangaru Vakili of Srivari Temple.
After darshan, he was offered Veda Aseervachanam by Vedic scholars at the Ranganayakula Mandapam.
Later, the Additional EO offered Tirtha Prasadams along with a lamination photo of Srivaru.
Temple Deputy EO Sri Lokanatham, Board Cell Deputy EO Smt. Prashanthi, VGO Sri Surendra and others participated in this program.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా శ్రీ దివాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం
తిరుమల, 2025 మే 23: టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తుడ ఛైర్మన్ శ్రీ దివాకర్ రెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ దివాకర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈఓ శ్రీమతి ప్రశాంతి, విజిఓ శ్రీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.