TULASI UTSAVAM OBSERVED _ శాస్త్రోక్తంగా తులసి మహత్యం ఉత్సవం

TIRUPATI, 21 JULY 2021: The celestial Tulasi Mahatya Utsavam was observed with religious ecstasy in Sri Govindaraja Swamy temple at Tirupati on Wednesday.

During the day, Sri Govindaraja Swamy flanked by Sridevi and Bhudevi were brought in Simha Vahanam and Asthanam was performed at Bangaru Vakili. The Archakas read out Tulasi Mahatyam episode from Puranas on this auspicious occasion.

Both the Senior and Junior Pontiffs of Tirumala, Special Grade DyEO Sri Rajendrudu and other officials were present in this fete which was observed in Ekantam due to Covid 19 restrictions.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా తులసి మహత్యం ఉత్సవం

తిరుపతి, 2021 జూలై 21: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం ఉద‌యం తులసి మహత్యం ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది.

ఇందులో భాగంగా శ్రీ దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు బంగారు వాకిలి చెంత సింహాస‌నంపై వేంచేపు చేశారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్వామివారికి ఆస్థానం నిర్వ‌హించారు. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఇవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, శ్రీ కుమార్‌, కంక‌ణ‌బ‌ట్ట‌ర్ శ్రీ బాలాజి దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.