TUMBURU THEERTHA MUKKOTI ON APRIL 12 _ ఏప్రిల్ 12న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి
Tirumala, 07 April 2025: The most important torrent festivals in Tirumala, the Tumburu Theertha Mukkoti will be observed on April 12.
Thousands of devotees trek the route and take holy bath on the auspicious day in the Theertham which is located in the deep forests.
TTD officials and devotees take part in the torrent fest.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 12న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి
తిరుమల, 2025 ఏప్రిల్ 07: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసివున్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 12న జరుగనుంది.
పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థాలు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం.
ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.