TWO WHEELERS PLYING ON GHAT ROADS RESTRICTION _ గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలు రద్దు
Tirumala,20 September 2023: As a devotee safety measure, TTD has cancelled the plying of two-wheelers on Tirumala ghat roads from 6pm of September 21 to 6am of September 23 in view of the heavy turnout of pilgrims for Garuda Seva on September 22.
In order to facilitate the devotees TTD has made an extensive parking facility at old Alipiri Check Point for two-wheelers and extended RTC bus service to Tirumala from Tirupati.
TTD has appealed to devotees to note the changes and cooperate with TTD towards the smooth conduction of the Garuda Vahana Seva.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలు రద్దు
తిరుమల, 2023 సెప్టెంబరు 20: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 22న గరుడసేవనాడు విశేషంగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాలను పార్క్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పిస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.