UGADI CELEBRATIONS AT SRI PADMAVATAHI AMMAVARI TEMPLE ON MARCH 19 _ మార్చి 19న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు
– DIVINE PROCESSION OF THE GODDESS IN PUSHPA PALLAKI
Tirupati, March 17, 2026: Grand Ugadi celebrations will be conducted at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor on March 19.
On this occasion, Kalyanotsavam will be performed at 10:00 AM and Abhishekam to the Utsava idols will be conducted at the Sri Krishna Swamy Mukha Mandapam from 3:00 PM to 4:00 PM.
In the evening, from 6:00 PM to 7:30 PM, the Goddess will bless devotees by taking a procession in the Pushpa Pallaki (floral palanquin) through the four Mada Streets surrounding the temple.
Later, Panchanga Sravanam will be held from 8:00 PM to 8:30 PM.
On account of the celebrations, VIP Break Darshan, Kumkumarchana, and Unjal Seva have been cancelled by TTD for the day.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 19న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు
– పుష్ప పల్లకిలో అమ్మవారి కటాక్షం
తిరుపతి, 2026 మార్చి 17: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనం, కుంకుమార్చన, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
