UGADI FESTIVITIES BY TTD IN MAHATI _ మార్చి 22న మహతిలో ఉగాది ఉత్సవం
TIRUPATI, 21 MARCH 2023: TTD will observe Sri Shobhakrut Nama Samvastsara Telugu Ugadi festivities in Mahati Auditorium in Tirupati on March 22 which commences at 9:30am.
As part of this, there will be Mangala Dhwani with which the programme commences followed by Veda Parayanam by Pundits. National Sanskrit Varsity Professor and Agama Advisor for TTD Dr Vedantam Vishnu Bhattacharya will render Panchanga Shravanam.
This will be followed by the “Asta Avadhānaṃ” a famous a linguistic literary technique which is unique to Telugu” by renowned Telugu scholar Dr Amudala Murali of Tirupati.
Later the cultural programmes, traditional fancy dress with the children of TTD employees, distribution of Ugadi Pacchadi will also be executed.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 22న మహతిలో ఉగాది ఉత్సవం
తిరుపతి, 2023 మార్చి 21: టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టులు, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవం మార్చి 22వ తేదీ బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరుగనుంది.
ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ముందుగా ఎస్.వి.సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, టీటీడీ ఎస్.వి ఉన్నత వేదాధ్యయన సంస్థవారిచే వేదపారాయణం నిర్వహిస్తారు. టీటీడీ ఆగమసలహాదారు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుపతికి చెందిన ప్రముఖ అవధాని శ్రీ ఆముదాల మురళి అష్టావధానం చేస్తారు.
అనంతరం టీటీడీ ఉద్యోగుల పిల్లలకు వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.