UNIFORM DONATED TO KKC BARBERS BY BOARD MEMBER _ తిరుమల కల్యాణకట్ట క్షుర‌కుల‌కు యూనిఫాం విరాళం

Tirumala, 12 Sep. 20: TTD Trust Board member Smt. Vemireddi Prasanthi Reddy has donated Rs.10lakh worth uniform to male and female barbers of Kalyanakatta in Tirumala. 

Additional EO Sri AV Dharma Reddy presented the uniform including two sets of Pancha and Shirt to male barbers and two sets of sarees to female barbers. 

The Kalyanakatta of TTD has 1050 male barbers and 275 female barbers working round the clock. 2100 pieces of Shirts and Panchas, 550 pieces of Sarees were distributed. 

The barbers thanks Smt Prasanthi Reddy for her largesse. 

DyEO KKC Sri Selvam, AEO Sri Jaganmohanachary were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల కల్యాణకట్ట క్షుర‌కుల‌కు యూనిఫాం విరాళం

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 12: తిరుమల కల్యాణకట్టలో విధులు నిర్వ‌హిస్తున్న పురుష‌, మహిళా క్షుర‌కుల‌కు రూ.10 ల‌క్ష‌లు విలువ గ‌ల రెండు జ‌త‌ల పంచ‌లు, ష‌ర్టులు, చీర‌ల‌ను శ‌నివారం ఉద‌యం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విరాళంగా అందించారు.

తిరుమ‌ల ప్ర‌ధాన కల్యాణ‌క‌ట్ట‌లో 1050 మంది పురుష‌ క్షుర‌కుల‌కు రెండు జ‌త‌ల పంచ‌లు, షర్టులు (2,100 పంచ‌లు, షర్టులు),  275 మంది మహిళా క్షుర‌కుల‌కు రెండు జ‌త‌ల చీర‌లను (550 చీరలు ) టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కులు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం, ఏఈవో శ్రీ జగన్మోహ‌నాచారి,  ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.