UNION MINISTER FOR FINANCE OFFERS PRAYERS_ శ్రీవారి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Tirumala, 17 Aug. 19: Union Minister for Finance Smt Nirmala Sitaraman offered prayers in hill shrine of Sri Venkateswara Swamy in Maha Laghu Darshan on Saturday evening.
She was accorded warm reception by Special Officer Sri AV Dharma Reddy.
Earlier she also took part in Sahasra Deepalankara Seva and also paved visit to Swamy Pushkarini, Sri Bhu Varaha Swamy, temple.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
తిరుమల, 2019 ఆగస్టు 17: కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ శనివారం సాయంత్రం శ్రీవారి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్ఢి ఘనంగా స్వాగతం పలికారు.
సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఊరేగింపులో శ్రీమతి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. స్వామి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణ చేసుకుని శ్రీవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. పుష్కరిణి హారతి అందుకున్నారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలో మహాలఘు దర్శనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.