UNION MINISTER OFFERS PRAYERS IN SRI PAT _ శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గౌ.శ్రీ కిషన్ రెడ్డి
Tiruchanoor, 13 Nov. 20: The Honourable Union Minister of State for Home Affairs, Sri G Kishen Reddy offered prayers in the temple Goddess Padmavathi Devi at Tiruchanoor on Friday evening.
Earlier he also participated in Simha Vahana Seva as part of ongoing annual Brahmotsavams at Tiruchanoor.
TTD Trust Board Chief Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy received the Union minister and accompanied him for darshan. Later he was offered prasadam inside temple.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గౌ.శ్రీ కిషన్ రెడ్డి
తిరుపతి, 2020 నవంబర్ 13: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గౌ. శ్రీ కిషన్ రెడ్డి శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్ద టీటీడీ ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బా రెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఛైర్మన్, ఈవో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి, డా.నిచ్చిత, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.