UPHOLDING THE SANCTITY OF TIRUMALA IS THE TOP MOST PRIORITY-TTD EO _ సామాన్య భక్తులకు పెద్దపీట _ తిరుమల పవిత్రతను పెంపొందించేలా చర్యలు _ టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు

BRIEFS THE MEDIA ON THE IMPROVEMENTS IN THE LAST ONE MONTH

TIRUMALA, 20 JULY 2024: Affirming that upholding the serenity and sanctity of Tirumala, is his topmost priority, TTD EO Sri J Syamala Rao briefed the media on the new improvements and changes brought in various aspects of the mechanism for the benefit of the multitude of visiting pilgrims in the last one month.

During the press conference held in Gokulam Rest House on Saturday in Tirumala, the EO said, the Honourable CM of AP Sri N Chandra Babu Naidu has ascertained him to revive the existing mechanism in terms of Darshan, Annaprasadam, Laddus, IT and other core areas in the larger interests of the pilgrims coming from various places across the country as well the world. 

After holding detailed departmental review meetings, in the last month, several changes have been brought in the mechanism which include streamlining the outside queue line system, enhancing the taste of Annaprasadams in MTVAC and also the quality of Laddus, bringing several IT reforms in Darshan and Accommodation bookings, upkeeping the sanitation, he asserted.

“Besides bringing changes in the TTD set-up, we are also keen on the health security of the tens of thousands of pilgrims coming to Tirumala. So, we have initiated steps against the big canteens (hotels) with the help of Food Safety Department authorities.  As a part of this, we closed down a big canteen a few days ago for not following norms provided by the Food Safety Standards Authority of India (FSSAI), for maintaining poor sanitation, charging huge prices and providing low quality and unhygienic food and also for not paying the Licence Fees despite several notices. “We have also launched a mobile Lab which tests about 80 ingredients”. 

The EO also said the hoteliers in Tirumala should follow quality and rates as per TTD guidelines and not sub-lease to others. Very soon a new policy with many other aspects will be brought to force, he maintained.

Adding further the EO also said, an exclusive laboratory with advanced equipment and improved specifications and testing standards is needed for Tirumala to verify the quality of at least ten to 12 important ingredients used in Srivari Prasadams and Anna Prasadams viz. ghee, rice, pulses, jaggery, sugar, tamarind, and many others.

He said that for the convenience of the devotees, a new shed has been set up for six thousand people to wait at the Narayangiri queues. “Three AEOs have been exclusively assigned the responsibility to ensure that drinking water, milk, Annaprasadams, and sanitation measures are provided to the devotees waiting in queues without any problem. Counters and additional toilets have also been set up to provide Annaprasadams to the waiting pilgrims in the outside queue lines. 

TTD will further strengthen the IT system and correct errors in the booking of Arjita Sevas, darshan, accommodation and other services. He said to avoid serpentine lines and long waiting hours for the pilgrims, we have increased the existing quota of 1.05lakh SSD tokens to 1.47lakh per week. More reforms will be brought in future for the benefit of scores of pilgrims visiting Tirumala”, he asserted.

JEO Sri Veerabrahmam, Chief PRO Dr T Ravi was also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

-సామాన్య భక్తులకు పెద్దపీట

-తిరుమల పవిత్రతను పెంపొందించేలా చర్యలు

-టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు

తిరుమల, 2024 జూలై 20 ; ప్రపంచం నలుమూలల నుండి ప్రతి రోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు.

తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు రెండు లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో భక్తులకు అందించవలసిన ఆహార పదార్థాలను నిర్ణయించినట్లు తెలిపారు.

ఇందుకోసం ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి, వారు సూచించిన విధంగా అన్నప్రసాద భవనంలో సిబ్బందిని పెంచడం, వంటశాలల ఆధునీకరణ, మెరుగైన పారిశుధ్య నిర్వహణ, తదితర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అన్నప్రసాదాలలో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను మరింత పెంపొందించేందుకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వారి సహకారంతో అత్యాధునిక నూతన ల్యాబ్ ను తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఇటీవల తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్ఎస్ డి) వారు ఏర్పాటుచేసిన మొబైల్ ల్యాబ్ లో 80 రకాల పదార్థాలను పరీక్షించవచ్చని చెప్పారు.

భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి క్యూలైన్ల వద్ద ఆరు వేల మంది వేచి ఉండేలా నూతన షెడ్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగు నీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరివేక్షించేలా ప్రత్యేకంగా ముగ్గురు ఏఈఓలకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. క్యూలైన్లలో మూడు చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు.

శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం స్టాండర్డ్స్ ప్రకారము నాణ్యమైన నెయ్యి, ముడి సరుకులు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

తిరుమలలో హోటల్ నిర్వాహకులు టీటీడీ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, రేట్లు ఉండాలన్నారు. హోటల్ లీజు దారులు సబ్ లీజుకు ఇవ్వకూడదని, తదితర అంశాలతో నూతన పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు.

టీటీడీ ఐటి వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనము, వసతి తదితర సేవల బుకింగ్ లో లోపాలను సరిదిద్దుతామన్నారు. గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న ఎస్ఎస్ డి టోకెన్లను, భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.47 లక్షలు ఇస్తున్నామని, వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు.

ఈ సమావేశంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సిపిఆర్ఓ డా. రవి, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.