UTLOTSAVAM FETE AT TIRUMALA _ తిరుమలలో వేడుక‌గా ఉట్లోత్సవం

Tirumala,20, August 2022: The Utlotsavam fete was grandly celebrated at Tirumala as part of the Sri Krishna Janmashtami fete on Saturday.

It is a traditional practice to observe Utlotsavam ( Shikyotsavam)  a day after Sri Gokulashtami. As part of festivities, Sri Malayappa and Sri Krishna Swami were paraded on separate Tiruchi’s on Mada streets.

Earlier the utsava murtis of Sri Malayappa Swami and Sri Krishna Swami are brought to Sri Pedda Jeeyarswami Mutt for Asthana and later taken to Sri Hathiramji mutt and Karnataka Chkultries and finally in front of the Srivari temple for Utlotsavam fete.

From evening to late at night devotees and locals participated in the Utlotsavam by breaking the Utloos( vessels ).

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswami, Sri SrinChinna Jeeyarswami, Srivari temple DyEO Sri Harindranath, Parpattedar Sri Uma Maheswar Reddy, and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో వేడుక‌గా ఉట్లోత్సవం

తిరుమల, 2022, ఆగస్టు 20 ;శ్రీ‌కృష్ణ‌జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్లో భాగంగా తిరుమలలో శ‌నివారం ఉట్లోత్సవం అత్యంత వేడుక‌గా జరిగింది.

శ్రీవేంకటేశ్వరస్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులోభాగంగా శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరువీధులలో ఊరేగుతూ ప‌లు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు.

ముందుగా శ్రీమలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా శ్రీ పెద్దజీయర్‌ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత హథీరాంజీ మఠానికి, కర్ణాటక సత్రాలు తదితర ప్రాంతాల్లో ఉట్లోత్సవం నిర్వహించారు. శ్రీ‌వారి ఆల‌యం ఎదుట ఉట్లోత్స‌వం ఉత్సాహంగా జ‌రిగింది. సాయంత్రం నుండి రాత్రి వరకు ఆద్యంతం కోలాహలంగా సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లను పగులగొట్టారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఇఓ శ్రీ హరీంద్రనాథ్, పార్ పత్తేదార్ శ్రీ ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.