VAHANA SEVAS CONCLUDES WITH ASWA _ అశ్వవాహనంపై క‌ల్కి అవ‌తారంలో క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

Tirupati, 15 February 2026: The vahana sevas as part of ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram concluded with  Aswa Vahana Seva on Sunday evening.

In the guise of Kalki, Sri Kalyana Venkateswara blessed His devotees on the divine Horse carrier.

Special Gr DyEO Smt Varalakshmi, Kankanabhattar Sri Balaji Rangacharyulu, AEO Sri Gopinath and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అవ‌తారంలో క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

తిరుపతి, 2026 ఫిబ్రవరి 15: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, తన సంకీర్తనలు చేసి తరించాలని ప్రబోధిస్తున్నారు.

వాహ‌న‌సేవ‌లో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపినాథ్‌, కంకణ బట్టర్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, ధ‌నశేఖ‌ర్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.