VAHANA SEVAS CONCLUDES WITH ASWA _ అశ్వవాహనంపై శ్రీరామచంద్రుడి వైభవం
TIRUPATI, 06 APRIL 2022: On the penultimate day of Sri Kodanda Rama Swamy Brahmotsavams Aswa Vahanam was observed on Wednesday evening.
The processional deity of Sri Rama was taken along four Mada streets to bless His devotees on the divine horse carrier which marked the conclusion of vahana sevas.
Senior and Junior Pontiffs of Tirumala, Spl Gr DyEO Smt Parvati and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అశ్వవాహనంపై శ్రీరామచంద్రుడి వైభవం
తిరుపతి, 2022 ఏప్రిల్ 06: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ జరుగనుంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామసంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.